షర్మిల ఆశలన్నీ అన్న మీదేనా?

sharmila has high hopes on brother ys jaganదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే పేరు దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈ నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నానని.. వచ్చే నెల 8న (వైఎస్ జయంతి సందర్భంగా) పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు.

కార్యకర్తలకే పార్టీలో పెద్ద పీట వేయబోతున్నామని …నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టపడే కార్యకర్తలే రేపటి నాయకులని… కార్యకర్తలు చెప్పిందే తన పార్టీ సిద్ధాంతమని షర్మిల పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యం చేసి వారి ఆశయాల మేరకు . పార్టీ విధానాలు రూపొందించేందుకు ఈ నెల రోజులు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని షర్మిల పేర్కొన్నారు.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా… తమ పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘంతో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారని సమాచారం. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన సీలింగ్ ఫ్యాన్ గుర్తు వచ్చేలా తమ పార్టీ కోసం టేబుల్ ఫ్యాన్ గుర్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పార్టీ పేరు ఏపీలోని అధికార పార్టీని పోలినట్టుగా ఉంది. తాజాగా ఆ పార్టీ గుర్తు కూడా అలాగే ఉండటం అంటే ఆమె తెలంగాణలోని జగన్ మద్దతుదారుల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని… అలాగే అన్న పార్టీకి తాము బీ టీమ్ అని చెప్పుకోదలిచారా అనే అనుమానాలు వస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories