కవిత వెనుక తెలంగాణ ఉంది…మరి షర్మిల వెనుక.?

Sharmila and Kavitha representing contrasting political paths shaped by party ties and regional sentiment in Telugu states

షర్మిల, కవిత తమ సొంత కుటుంబ సభ్యుల చేతే రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్న చెల్లెళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో తమదైన ముద్ర వేసుకున్నారు. అయితే కవిత రాజకీయ ప్రయాణం నుంచి షర్మిల రాజకీయ ప్రచారం వరకు వారి రాజకీయ జీవితం బిఆర్ఎస్, వైసీపీ లతో ముడిపడి ఉన్నాయి.

అయితే కవిత బిఆర్ఎస్ పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్సీ గా కీలక పాత్ర పోషించింది, షర్మిల వైసీపీ కష్ట కాలంలో తన పాదయాత్రతో పార్టీ భుజం కాసింది, అన్న జగన్ కు తోడుగా నిలిచింది. అయితే ముందుగా షర్మిల విషయానికొస్తే ఏపీలో వైసీపీ తో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టిన షర్మిల కేవలం ప్రచారానికి పరిమితమయ్యి తెలంగాణలో టి. వైసీపీ తో ప్రాంతం మార్చింది.

ADVERTISEMENT

అయితే షర్మిల ప్రచారాలు ఏపీలో వైసీపీ కి పనిచేసినట్టుగా తెలంగాణలో టి. వైసీపీ కి వర్క్ అవ్వలేదు. దానితో తెలంగాణలో దుకాణం ముగించి తిరిగి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రూపంలో రాజకీయ రంగ ప్రవేశం చేసింది షర్మిల. ముందుగా ఏపీలో బై బై బాబు అంటూ మొదలుపెట్టిన షర్మిల అటు పిమ్మట తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ కదిలింది, తిరిగి వైసీపీ పతనం అంటూ కథం తొక్కింది.

అయితే ఇక్కడైన షర్మిల రాజకీయంగా సక్సెస్ అయ్యిందా అంటే తానూ గెలవలేకపోయినా అన్న ఓటమిలో, వైసీపీ పతనంలో తనవంతు పాత్ర పోషించింది. షర్మిల ఈ రకంగా పార్టీలు మారుస్తూ, ప్రాంతాలను మార్చుకుంటూ రాజకీయం చెయ్యాలనుకుంటే దాని వెనుక ఎదో ఒక బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి.

ఉదాహరణకు కవిత విషయానికొస్తే ఇంతవరకు కల్వకుంట్ల అనే బ్రాండ్, బిఆర్ఎస్ అనే బలం కవిత రాజకీయానికి ఒక కవచంలా నిలబడ్డాయి. కానీ కవిత కు ఇప్పుడా బలమే బలహీనతగా మారింది. అయినా ఇటువంటి దిక్కుతోచని సందర్భంలో కూడా కవిత వెనుక తెలంగాణ అనే సెంటుమెంట్ ఒక అస్త్రంలా పనిచేస్తుంది.

ఇక కవిత భవిష్యత్ రాజకీయం తెలంగాణ అనే ప్రాంతీయవాద సెంటిమెంట్ చుట్టూ తిరగబోతుంది అనేది సుస్పష్టం. బనకచర్ల విషయమే చూసుకుంటే తెలంగాణ నుంచి వృధాగా సముద్రంలో కలిసే నీటి పై కూడా ఏపీ ప్రాజెక్ట్ నిర్మాణం చెయ్యకూడదని, అలా చేస్తే అది తెలంగాణ వ్యతిరేక నిర్మాణమే అవుతుందంటూ మొదటిగా గళం విప్పింది కవితే.

ఆ ఒక్క నినాదంతో కవిత కొన్ని రోజుల పాటు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక తెలంగాణలో బీసీ ల 40% రిజర్వేషన్ అంశాన్ని కూడా కవిత చాల చాకచక్యంగా తన వైపు తిప్పుకోగలిగింది. ఇలా కవిత గత రాజకీయ ప్రయాణం అనుభవంలా మారి భవిష్యత్ లో తానూ చేయబోయే ఒంటరి రాజకీయానికి ఊతమిస్తుంది.

ఇలా జాగృతి పేరుతొ కవిత సాగిస్తున్న ఒంటరి ప్రయాణానికి తెలంగాణ అనే ప్రాంతీయ సెంటిమెంట్ భావం బలంగా పనిచేస్తుంది. మరి కాంగ్రెస్ తో షర్మిల మొదలుపెట్టిన రాజకీయానికి ఇటువంటి బలమైన భావన కానీ దృఢమైన రాజకీయ సంకల్పం కానీ ఉందా.? అనేది షర్మిల ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories