న్యూడ్ వీడియోకి కులానికి ఏమిటి సంబందం?

 Shivabala Kuruba Women's Leader comments Gorantla Madhav Nude videoవైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో మీడియాలో లీక్ కాగానే అందులో ఉన్నది తాను కాదని, తాను జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసుకొంటుండగా తీసిన వీడియోని టిడిపి మార్ఫింగ్ చేయించిందని వాదించారు. రాజకీయ నాయకులు ఏవైనా వివాదాలు లేదా సమస్యలలో చిక్కుకొన్నప్పుడు కులం ప్రస్తావన చేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కనుక గోరంట్ల మాధవ్‌ కూడా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించి దీని నుంచి బయటపడేందుకు బీసీ కార్డు ప్రయోగించారు. బీసీ (కురబ) వర్గానికి చెందిన నేను రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగితే చూసి ఓర్వలేక తనపై ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

గోరంట్ల మాధవ్‌ కురుబ కుల ప్రస్తావన చేయడంపై ఆ కురుబ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శివబాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరపురంలో ఆమె మహిళా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియోలో అడ్డంగా దొరికిపోయినా ఏ మాత్రం సిగ్గూశరం లేకుండా ఇంకా తాను బీసీనని, తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని చెపుతుండటం సిగ్గుచేటు.

ADVERTISEMENT

అసలు మీ న్యూడ్ వీడియోకి, కురుబ కులానికి ఏమిటి సంబందం?చెప్పగలరా?కురుబ కులస్తులు మీకు ఓట్లేసి పార్లమెంటుకి పంపింది ఈవిదంగా కులం పరువు తీయడానికేనా?మీరు చేసిన పనికి కురుబ కులస్థులే కాదు… యావత్ రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలదించుకొంటున్నారు.

గోరంట్ల మాధవ్‌ ఇంత నీచమైన పనిచేసినా సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం కూడా తప్పే. తక్షణం ఆయన చేత పదవికి రాజీనామా చేయించి పార్టీలో నుంచి బహిష్కరించాలి అని కురుబ కులం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నాలుగు గోడల మద్య ఆ పని చేశాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా దృవీకరించిన సంగతి తెలిసిందే. కానీ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఆ వీడియో నకిలీదని దాంతో గోరంట్ల మాధవ్‌కు ఎటువంటి సంబందమూ లేదంటూ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంటే గోరంట్ల మాధవ్‌ తప్పు చేసినట్లు జగన్ ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ ఈ కేసు నుంచి ఆయనను బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకొంటే, వైసీపీలో ఇంకా అనేక మంది నేతల వ్యవహారాలన్నీ బయటకి వస్తాయి. వారందరిపై చర్యలు తీసుకొంటే పార్టీ ఖాళీ అయిపోతుంది. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడం లేదని టిడిపి వాదిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories