దాదాపు రెండేళ్ల పాటు టి-20 ఇంటర్నేష్నల్ లకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, మళ్లీ జట్టులో చోటు సంపాదించుకోవడం అంత సులభమేమి కాలేదు. గత మూడు ఐపీఎల్ సీజన్లలోనూ నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు కెప్టెన్సీలో తన మార్క్ చూపించిన అతడికి సెలెక్షన్ కమిటీ మరో అవకాశం ఇచ్చేలా చేసింది.
అయితే అయ్యర్ జట్టులోకి రావటం కేవలం ఒక బ్యాటర్ గానే కాక, కెప్టెన్ గా రావటం ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. మరి ఇందుకై 2026 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని సెలెక్టర్లు అయ్యర్ కు అప్పగించారు. వరల్డ్-కప్ విన్నింగ్ కెప్టెన్ ను పక్కనపెట్టి ,మరి అయ్యర్ కు పగ్గాలందించటంతో అభిమానులు అయ్యర్ కెప్టెన్సీ పై భీభత్సమైన అంచనాలు పెట్టుకోకమానలేదు.
ఐపీఎల్‌లో జట్టును సమర్థంగా నడిపించిన అయ్యర్, ఒత్తిడిని తట్టుకునే నాయకుడిగా గుర్తింపు పొందటమే కాక దశాబ్ద కాలం తరువాత కోల్కతా కు కప్ అందించాడు, దశాబ్ద కాలం తరువాత పంజాబ్ ను ఫైనల్ కు పట్టుకెళ్ళాడు. ఆ అనుభవమే భారత జట్టు నాయకత్వానికి సరైన ఎంపికగా అతడిని నిలబెట్టింది. దీంతో కొత్త శకం మొదలవుతుందనే ఆశలు అభిమానుల్లో కనిపించాయి.
అయితే కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అయ్యర్ ఆశించిన ముద్ర వేయలేకపోయాడు. ఇటు బ్యాటింగ్‌లోనూ అటు కెప్టెన్సీ లో ను అతడి నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. కెప్టెన్‌గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా విమర్శలకు గురయ్యాయి. ఫీల్డ్ ప్లేస్‌మెంట్లు, బౌలింగ్ మార్పులతో పాటు 2వ టి-20 లో తొలుత ఫీల్డింగ్ చేయాలనే నిర్ణయాలు అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
అయినా ఒక్క సిరీస్ ఓటమి కారణంగా అయ్యర్ క్యాపబిలిటీ ను ముందే అంచనా వెయ్యటం సరైనది కాదని పలువురు క్రికెట్ దిగ్గజాలు చెప్పుకొస్తున్నారు. ప్రతి కొత్త నాయకుడికి జట్టును అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. ఆటగాళ్ల బలాబలాలు తెలుసుకుని సరైన బాధ్యతలను సమకూర్చటానికి అనుభవం కీలకం. అందుకే అయ్యర్ కు కాస్త సమయం ఇవ్వటం మంచిదే అంటూ ఈ కొత్త కెప్టెన్ ను ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ సిరీస్ పరాజయం భారత జట్టుకు చారిత్రాత్మకంగా కూడా నిరాశ కలిగించింది. గత ఏడేళ్లలో తొలిసారి భారత్ ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను వైట్వాష్/క్లీన్-స్వీప్ గా కోల్పోయింది. వరుసగా 12 బ్యాక్-టు-బ్యాక్ సిరీస్ విక్టరీ స్ట్రీక్ కు బ్రేక్ పడింది, అలాగే వరుసగా 16 ఓటమి ఎరుగని సిరీస్ స్ట్రీక్ కు ఎండ్ కార్డు పడింది. ఇలా, కొన్ని అమూల్యమైన స్ట్రీక్ ల ను భారత్ ఈ సిరీస్ ఓటమితో ముగించుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి ఫలితం రావడంతో అయ్యర్ నాయకత్వంపై సహజంగానే ప్రశ్నలు మొదలయ్యాయి. తొలి సిరీస్‌లోనే జట్టును విజయపథంలో నడిపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. కెప్టెన్‌గా తొలి సిరీస్ లో తన మార్క్ కెప్టెన్సీ తో శుభారంభం చేసే అతని చేతుల నుంచి జారిపోయింది. అయినప్పటికీ అతని నాయకత్వ ప్రయాణం ఇప్పుడే మొదలైందనే విషయాన్ని కూడా మర్చిపోలేం.
ఇప్పుడు అయ్యర్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇంగ్లండ్ పర్యటన. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం ఏ జట్టుకైనా కఠినమైన పరీక్షే. అలాంటి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్‌గా అయ్యర్ తన వ్యూహాలతో జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయ్యర్ ప్రతిసారి తనపై వచ్చిన సందేహాలకు బ్యాట్ తోనే సమాధానమిస్తాడు, మరి ఈ సిరీస్ నెగ్గి తన పై వచ్చిన కెప్టెన్సీ అనుమానాలకు చెక్ పెట్టగలడా..?




