మహేష్ సినిమా భారం సగం తగ్గినట్టే!

shruthi haasan to pair with mahesh babu in murugadoss movieప్రిన్స్ మహేష్ బాబు డేట్లు సంపాదించడం ఎంత కష్టమైన విషయమో, ఆయనకు జోడిని ఎంపిక చేయడం కూడా నిర్మాతలకు అంతకు మించిన భారంగా మారుతోంది. ‘ప్రిన్స్’ పక్కన మెరిసే ‘ప్రిన్సెస్’ ఎంపిక కోసమే ఆ అయిదారు మాసాలు గడిపిన సందర్భాలు ఇటీవల కాలంలో బాగానే నమోదయ్యాయి. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం కోసం కూడా అనేక మందితో సంప్రదింపులు జరిపిన మీదట ఎట్టకేలకు సమంత, కాజల్, ప్రణీతలను ఎంపిక చేసారు.

ADVERTISEMENT

ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ తో చేయబోతున్న సినిమాకు మహేష్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ ను సెలెక్ట్ చేసారని ఇటీవల వార్తలు హల్చల్ చేసాయి. తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ ఉన్న శృతి అయితే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని మరియు ‘శ్రీమంతుడు’తో హిట్ పెయిర్ అనిపించుకోవడంతో దాదాపుగా శృతి ఓకే అయినట్లుగా తేలింది.

అయితే, తాజాగా కోలీవుడ్ లో లభిస్తున్న సమాచారం ప్రకారం… బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను ఫైనల్ చేసారని తెలుస్తోంది. దక్షిణాదిలో అవకాశం వస్తే మహేష్ తో కలిసి నటించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచిన శ్రద్ధాకు మురుగదాస్ ఆఫర్ అనుకోకుండా ఎదురయ్యిందని, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిసిపోయాయని, ప్రిన్స్ సరసన మేరవబోయే ప్రిన్సెస్ శ్రద్ధా కపూర్ అని కోలీవుడ్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఇదే జరిగితే, మహేష్ సినిమా భారం సగం తగ్గినట్లేనని సోషల్ మీడియాలో ఛలోక్తులు పడుతున్నాయి. ‘ఫ్లాష్ బ్యాక్’లను పరిశీలిస్తే… కాదనలేం మరి!

ADVERTISEMENT
Latest Stories