శృతిహాసన్‌కు అరుదైన అవకాశం

shruthi hassan in majnu movieఐరెన్‌ లెగ్‌ బ్రాండ్‌తో కెరీర్‌ను ఆరంభించిన శృతి హాసన్‌ పట్టుదలతో విజయాలు సాధించి ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లో సైతం స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ ఉంది. పలువురు తెలుగు హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నటించినప్పటికి మరో సారి ఈమెతో రొమాన్స్‌కు సిద్దం అవుతున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో శృతిహాసన్‌ ఇప్పటికే రొమాన్స్‌ చేసింది. మరో సారి ఈ ముగ్గురి సరసన ఒకే సమయంలో హీరోయిన్‌గా నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.

ఒకే సారి ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. కాని శృతిహాసన్‌ ఆ అవకాశాన్ని దక్కించుకుంది. మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చే వేసవిలో ప్రారంభం కాబోతున్న ఒక భారీ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. ‘ఎవడు’ చిత్రంలో తనతో జత కట్టి సక్సెస్‌ను తెచ్చి పెట్టిన శృతిహాసన్‌తో రొమాన్స్‌ చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు. అందుకే ‘తను వరువన్‌’ రీమేక్‌లో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా బుక్‌ చేయించుకున్నాడు. ఇక ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో చిన్న పాత్రలో నటించి ఆకట్టుకున్న శృతిహాసన్‌కు తన తాజా చిత్రం ‘జనత గ్యారేజీ’లో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ రోల్‌ ఇవ్వాలని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నాడు. ఇలా ఈ ముగ్గురు హీరోలతోనే కాకుండా నాగచైతన్యకు జోడీగా ‘మజ్ను’ చిత్రంలో కూడా శృతి హాసన్‌ నటిస్తుంది. మరో వైపు తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె నటిస్తూనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories