తుస్సుమన్న ‘మెగా హీరో’ హంగామా!

allu sirish-lavanya-srirastu-subhamastu-first-look-posterప్రేక్షకుల ఆసక్తిని రాబట్టేందుకు పెళ్లి విషయమూ, సినిమా పేరో అన్న విషయం తేల్చకుండా “శ్రీరస్తు… శుభమస్తు…” మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ అల్లు శిరీష్ చేసిన సందడి చివరికి తుస్సుమంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ఈ పేరు ఖరారైందని తేలింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

కలర్ ఫుల్ పోస్టర్ లో ఈ సినిమా హీరోహీరోయిన్లు అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠిలతో పాటు చిత్ర ముఖ్య తారాగణం ప్రకాష్ రాజ్, సుమలత, రావు రమేశ్, తనికెళ్ల భరణి, రవికాంత్ తదితరులు దర్శనమిచ్చారు. పోస్టర్ డిజైన్ అయితే రంగు రంగులుగా బాగానే ఉంది గానీ, అందులో ఉన్న మెగా హీరో ప్రతిరూపాన్ని సందర్శించడం మెగా అభిమానుల సైతం వల్ల కావడం లేదని ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందడి చేస్తున్న అంశం.

ADVERTISEMENT

వాలైంటైన్స్ డే కానుకగా విడుదలైన ఈ పోస్టర్ అయినా అల్లు శిరీష్ కు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. “గౌరవం” దారుణ పరాజయాన్ని చవిచూడగా, “కొత్తజంట” మారుతీ బ్రాండ్ మీద కాస్త నడిచింది. మరి ముచ్చటగా మూడవ సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తారో లేక నిర్మొహమాటంగా తిరస్కరిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories