‘సైజ్‌ జీరో’ రియల్‌ స్టోరీ

size zero storyఅనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘సైజ్‌ జీరో’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌ కథ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు పదే పదే చెబుతున్నారు. కథలో ఉండే భావోద్వేగాలు తనకు బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను అని, కథ బలం వల్లే తాను బరువు పెరిగాను అంటూ అనుష్క ప్రమోషన్‌ సందర్బంగా చెప్పుకొచ్చింది. ఈ సినిమా కథ గురించి మరో ఆసక్తికర విషయాన్ని ఈ చిత్ర రచయిత కనిక చెప్పుకొచ్చింది.

ఈ కథను తాను కొన్ని నిజ జీవిత సంఘటనల నుండి తీసుకున్నట్లుగా కనిక చెప్పుకొచ్చింది. నిజ జీవిత సంఘటనలకు కాస్త కల్పితం మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడిరచి తయారు చేసిన కథ ఇది అని కనిక పేర్కొంది. ఒక లావుగా ఉండే అమ్మాయి ఇంట్లో మరియు సమాజంలో ఎదుర్కొనే సమస్యలను తాను స్వయంగా చూసి ఈ కథను రాశాను అని కనిక చెప్పుకొచ్చింది. అనుష్క ఈ సినిమాలో లావు సమస్యతో బాదపడుతూ ఉంటుంది అనే విషయం తెల్సిందే. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాలో సొనాల్‌ చౌహాన్‌ ముఖ్య పాత్రలో నటించింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

ADVERTISEMENT
Latest Stories