చిన్న హీరోలు..పెద్ద హిట్లు..!

small-heros-big-hits

ఈ ఏడాది చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయాలను సాధించిన చిత్రాలు అనేకం. అలాగే ఇప్పుడిప్పుడే చిత్ర సీమలో బుడిబుడి అడుగులు వేస్తూ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటున్న యువ నటులు ఈ ఏడాది తమ సినిమాలతో మంచి విజయాల్నే కాదు తగిన గుర్తింపును తెచ్చుకున్నారు.

దానిలో ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నాయనమ్మ నేనున్నా అంటూ తొడకొట్టిన తేజ హనుమాన్ తో వచ్చి 2024 కి శుభారంభం పలికారు. ఎదురు బుల్డోజర్లు వస్తున్నాయి, నువ్వు సైకిల్ తో వస్తునావ్, నలిగిపోతావ్ జాగ్రత్త అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలకు తన సైకిల్ పవర్ ఏంటో చూపించారు తేజ సజ్జ.

ADVERTISEMENT

హనుమాన్ గా టాలీవుడ్ కు తేజ ఇచ్చిన పాన్ ఇండియా విజయాన్ని కొనసాగిస్తూ టిల్లు స్క్వేర్ అంటూ వచ్చిన సిద్దు జొన్నగడ్డ టిల్లు రికార్డులను బద్దలుకొట్టారు. చిన్న సినిమాకు సీక్వెలా అంటూ నోరెళ్లబెట్టిన వాళ్లకు టిల్లు క్యూబ్ కోసం వేచి చూసేలా చేసారు సిద్దు. టిల్లు సిరీస్ తో టాలీవుడ్ ‘స్టార్ బాయ్’ గా ఎదిగారు సిద్దు.

ఇక ఇదే ఫార్మాట్లో సీక్వెల్ కథలను నమ్ముకుని మత్తువదలరా-2 అంటూ ముందుకొచ్చిన సింహా కోడూరి, చిన్న సినిమాలంటే ఓటిటిలోనే చూద్దాం అనుకునే ప్రేక్షకుల మత్తు వదిలించి వారిని సైతం ‘వేర్ ఈజ్ రియా’ అంటూ థియేటర్లకు రప్పించారు. ఈ సినిమాలో ఏసుదాస్ క్యారెక్టర్లో హీరో ఫ్రెండ్ గా చేసిన సత్య మంచి గుర్తింపుని పొందారు.

ఇక కమిటీ కుర్రాళ్ళు అంటూ అంతా కొత్త తారాగణంతో వచ్చిన చిన్న సినిమా పెద్దల మనసు గెలిచింది. 90 ‘s నాటి మధుర జ్ఞాపకాలతో అప్పటి వాతావరణాన్ని,ఆ నాటి వారి అలవాట్లను ఈ తరం వారికీ తెలియచెప్పిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఆయ్ అంటూ అందరిని ఆప్యాయంగా పలకరించిన నార్నె నితిన్ ను కూడా ప్రేక్షకులు ఆదరించారు.

తీసిన ప్రతి సినిమా ఓటిటిలో అయితే ఒకే కానీ థియేటర్లో అంటే నాట్ ఓకే అనేలా కొనసాగుతున్న కిరణ్ అబ్బవరం సినీ కెరీర్ ను ‘క’ మూవీ మార్చేసింది.అబ్బవరం కూడా ఊహించని విజయంతో ‘క’ పాన్ ఇండియా ప్రేక్షుకులను ఆకట్టుకుంది. ఇలా ఈ ఏడూ చిన్న సినిమాలు పెద్ద విజయాలను అందుకుని అటు ఇండస్ట్రీకి ఇటు హీరోలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది

ADVERTISEMENT
Latest Stories