251 రూపాయల “స్మార్ట్ ఫోన్” ఫస్ట్ లుక్!

smartphone for Rs 251 first look‘స్మార్ట్’ విభాగంలో సంచలనం సృష్టిస్తున్న 251 రూపాయల మొబైల్ ఫోన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 4 అంగుళాల టచ్ స్క్రీన్, 1 జిబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3.2 ఎంపీ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1450 ఎంఏహెచ్ బ్యాటరీతో లభ్యమయ్యే ఈ ఫోన్ ఫస్ట్ లుక్ చూపరులకు ఆకట్టుకుంటోంది. అయితే సాధారణ మొబైల్ ఫోన్ యాక్ససర్రీస్ కూడా ఈ ధరలో లభ్యం కాకపోవడంతో, ఈ ఫోన్ పై సామాన్యుల దృష్టి పడింది.

రింగింగ్ బెల్స్ ‘ఫ్రీడమ్ 251’ పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్ ను సొంతం చేసుకోవాలనే అభిమతం సర్వత్రా వ్యక్తం కావడంతో, ఈ ఫోన్ ఎక్కడ లభ్యమవుతుందనే దానిపై ప్రశ్నలు మొదలయ్యాయి. తాజా సమాచారం మేరకు 18వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటల వరకూ పలు ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా బుకింగ్స్ ను తీసుకుంటామని ‘రింగింగ్ బెల్స్’ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత డెలివరీలను ప్రారంభిస్తామని, జూన్ 30వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ లు చేసుకున్న అందరికీ డెలివరీ అందజేస్తామని, ఆ తర్వాత ఓపెన్ మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.

ADVERTISEMENT

smartphone-for-Rs-251-photo

smartphone-for-Rs-251-photo

ADVERTISEMENT
Latest Stories