సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్ ఖరారు

Solo Brathuke So Better Release date on 25th December 2020సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ కరోనా వైరస్ పండెమిక్ మరియు లాక్ డౌన్ తరువాత విడుదలయ్యే మొట్టమొదటి పెద్ద సినిమా. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. 25 శుక్రవారం కావడం ఆ తరువాత వారాంతపు హాలిడేస్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల అడ్వాంటేజ్ ఉంటుంది.

ADVERTISEMENT

అయితే 50% ఒకుపెన్సీ, కరోనా కారణంగా థియేటర్లకు రావడానికి ప్రేక్షకుల నిర్లిప్తత వంటి కారణంతో ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి పర్మిషన్ ఇవ్వడంతో రెండు రాష్ట్రాలలో థియేటర్లు తీర్చుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. అయితే ఇప్పటి వరకు థియేటర్ల ఓపెనింగ్ రోడ్ మ్యాప్ సిద్ధం కాలేదు.

డిసెంబర్ నాలుగున టెనెట్ విడుదల కోసం కొన్ని థియేటర్లు తీర్చుకునే అవకాశం ఉంది. అప్పటి నుండి క్రిస్మస్ నాటికి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి అలవాటు చెయ్యాలి. కొత్త దర్శకుడు సుబ్బ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.

ఈ చిత్రం యొక్క ఆన్‌లైన్ విడుదల గురించి గతంలో అనేక పుకార్లు వచ్చాయి. అయితే సాయి ధరమ్ తేజ్ ఇప్పుడున్న పరిస్థితులను డేర్ చేస్తూ థియేటర్లలో సినిమా ను రిలీజ్ చేస్తున్నాడు. వరుస ప్లాపుల తరువాత ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ కు ప్రతి రోజు పండగే తో పెద్ద హిట్ దక్కింది. ఈ సినిమా తో సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు.

ADVERTISEMENT
Latest Stories