ఆర్ఆర్ఆర్ లో అలియా కోసం స్పెషల్ సాంగ్

special song for Alai Bhatt in rrr movieబాలీవుడ్ భామ అలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగులో డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ సినిమా ఇది. ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్ సరసన కనిపించనుంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లోనే ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో ఆమె పాత్ర తక్కువే అయినా, ఆమెకు ఒక స్పెషల్ పాట ఉంటుందట. ఆ పాటలో ఆమె చేస్తున్న పాత్ర యొక్క విశిష్టత చెబుతుందట. ఈ సినిమాలో నటిస్తున్న మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయనతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో జులై 30న విడుదల అవుతుందని తెలిపిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ కు వాయిదా పడినట్టు సమాచారం. కొందరు ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుందని కూడా అంటున్నారు. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య.

బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది.

ADVERTISEMENT
Latest Stories