‘బాహుబలి’ టీజర్ విడుదల! ప్రభాస్ మారిపోయాడు!

‎Baahubali‬ spoof - ‪Sampoornesh‬, Prudhvi‬ , ‪Suma‬ in ‎MAA Tea Awardsఅవును… “బాహుబలి” సినిమా టైటిల్ పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారిపోయాడు. అయితే ఇది రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ సినిమా కాదు, ప్రముఖ ‘మా’ టెలివిజన్ సంస్థ తీస్తున్న ‘బాహుబలి’ స్కిట్ కోసం! ప్రభాస్ స్థానంలో ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబును ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఒక్క ‘బాహుబలి’ పాత్రకే కాదు, కాళికేయ పాత్రలో కూడా సంపూనే దర్శనమిస్తున్నారు.

ప్రతి ఏడాది ఈ సంస్థ అత్యంత వైభవంగా నిర్వహించే ‘మా టీవీ అవార్డ్స్’ కోసం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ పాత్రలన్నీ వీరిని వరించాయి. ఇక, అత్యంత కీలకమైన రమ్యకృష్ణ పాత్రను యాంకర్ సుమ పోషిస్తుండగా, కట్టప్ప పాత్రలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కనపడనున్నారు. ఆసక్తి గొలుపుతున్న కాస్టింగ్ తో భారీ అంచనాల నడుమ దీనికి సంబంధించిన ప్రమోషనల్ టీజర్ ను విడుదల చేసారు.

ADVERTISEMENT

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. బహుశా ఈ అవార్డు వేదికలపై ఎంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నా, ఈ ‘బాహుబలి’ స్పూఫ్ ప్రధాన హైలైట్ అయ్యే సంకేతాలను ఇస్తోంది. మరి మీరు ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
Latest Stories