ఆ విషయంలో ‘స్పైడర్’ టీం గ్రేట్!

SPYder Mahesh Teaserఆగష్టు 9వ తేదీ… ఉదయం 9 గంటలకు… “స్పైడర్” టీజర్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ మాదిరి కాకుండా, చెప్పిన టైంకు ప్రిన్స్ మహేష్ బాబు యూ ట్యూబ్ ప్రత్యక్షం అవుతాడని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ టీజర్ అనుకున్న సమయానికే విడుదల కాగా, ‘బూమ్ బూమ్’ అనే తొలి పాట మాత్రం అభిమానుల సహనాన్ని పరీక్షించిన విషయం తెలిసిందే. దీంతో అలాంటి అనుభవాలు ఎదురుకాకుండా, చెప్పిన సమయానికి ప్రిన్స్ ల్యాండ్ అవుతాడని ఫ్యాన్స్ వేయి కళ్ళతో వేచిచూస్తున్నారు.

విడుదల సమయం విషయం అలా ఉంచితే, ఒక్క విషయంలో మాత్రం “స్పైడర్” చిత్ర బృందాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇటీవల కాలంలో ప్రతి పెద్ద సినిమా కూడా లీకుల బారిన పడుతూ… అధికారికంగా విడుదల చేయడాని కంటే ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్న విషయం తెలిసిందే. ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచిన “బాహుబలి 2” మరియు జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” చిత్ర విషయాలలో లీకులు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. కానీ ఎలాంటి లీకులు లేకుండా అరికట్టడంలో “స్పైడర్” బృందం విజయవంతం అయ్యిందనే చెప్పాలి.

ADVERTISEMENT

ఈ రెండవ టీజర్ వరకు కూడా ఎలాంటి లీకులు లేకుండా, అధికారికంగా విడుదలయ్యే వరకు ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టడంలో సక్సెస్ అయిన “స్పైడర్,” మున్ముందు సినిమా విడుదల వరకు అదే ఒరవడిని కొనసాగించగలిగితే గొప్ప విషయంగానే భావించాలి. ఎందుకంటే రెండు భాషలలో విడుదల అవుతోన్న సినిమా కావడంతో, ఎక్కడో ఒక చోట లీకులకు అవకాశం లభిస్తుంది. గతంలో ‘బాహుబలి 2’ ట్రైలర్ విషయంలో ముందుగా తమిళ వర్షన్ లీక్ కావడంతో, అన్ని భాషల ట్రైలర్స్ ను అనుకున్న సమయాని కంటే ముందుగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories