“నాన్ బాహుబలి” రికార్డులను “స్పైడర్” కొట్టేసినట్లే!

Spyder Non Baahubali Recordsరాసుకోండి… మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న “స్పైడర్” సినిమా ‘నాన్ బాహుబలి’ రికార్డులన్నీ కొట్టిసినట్లే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ రికార్డులు తమ వశం అయ్యే విధంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. అవును… దసరా పండగను ఫుల్ గా వినియోగించుకునే విధంగా “స్పైడర్” రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 27వ తేదీగా ఖరారు చేసారు.

సహజంగా వీకెండ్స్ లో… శుక్రవారం నాడు, ఒక్కోసారి గురువారం నాడు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ “స్పైడర్” విడుదలకు ముహూర్తాన్ని బుధవారం నాడు ఫిక్స్ చేయడంతో… వీకెండ్ ముగియాలంటే 5 రోజులు ఉంది. ‘స్పైడర్’కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ అయిదు రోజుల్లోనే ‘నాన్ బాహుబలి’ రికార్డులు కనుమరుగు కావడం తధ్యం అన్న అభిప్రాయం ట్రేడ్ పండితులలో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT

ఒకవేళ సినిమాపై భిన్న స్పందనలు వచ్చినా… రెండవ వీకెండ్ నాటికి రికార్డులన్నీ ‘స్పైడర్’ వశం కావడం అన్న భావన కూడా హల్చల్ చేస్తోంది. ఎందుకంటే… ‘బాహుబలి’ తర్వాత అంతటి స్థాయిలో అటు ట్రేడ్ వర్గాలలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ అంత బజ్ ను సొంతం చేసుకున్న సినిమా “స్పైడర్.” తెలుగు, తమిళ భాషలతో పాటు చివరి నిముషంలో హిందీ, మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

ADVERTISEMENT
Latest Stories