కంటెంట్ లేకపోతే ఎన్టీఆర్ కూడా ఏం చేయలేరు!

కంటెంట్ లేకపోతే ఎన్టీఆర్ కూడా ఏం చేయలేరు!హీరోగా శ్రీవిష్ణుకు ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా సరికొత్త కధాంశాలతో తనలోని విలక్షణ ప్రతిభను వెలుగులోకి తెచ్చే విధంగా స్టోరీలను ఎంపిక చేసుకుంటారనే టాక్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం “అర్జున ఫల్గుణ” సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.

‘అఖండ, పుష్ప’ సినిమాలు అందించిన కలెక్షన్స్ తో టాలీవుడ్ మాంచి ఊపులో ఉండగా విడుదలైన ‘అర్జున ఫల్గుణ’ ఈ ఒరవడికి బ్రేకులు వేసింది. రిలీజ్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరు కేంద్రంగా పబ్లిసిటీ కూడా జోరుగా సాగడంతో ఓపెనింగ్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దుమ్ము దులిపేస్తారని చిత్ర యూనిట్ భావించింది.

ADVERTISEMENT

కానీ ఫస్ట్ షోకే సినిమాలో అస్సలు విషయం లేదని తేలిపోవడంతో, మొదటి రోజైతే సోషల్ మీడియాలో టికెట్లు ఫ్రీగా పెట్టిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఇలాంటి స్థితి ఏ సినిమాకు ఎదురుకాలేదు. ఇప్పటివరకు నటించిన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు కెరీర్ లోనే ఈ సినిమా ఓ మాయని మచ్చలా నిలిచిపోయింది.

శ్రీవిష్ణు సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడూ కూడా సినిమా కంటెంట్ మరియు హీరో పేరుతోనే సాగుతాయి. కానీ ఈ సారి అందుకు విరుద్ధంగా ఈ చిత్ర ప్రమోషన్స్ జూనియర్ ఎన్టీఆర్ పేరు చుట్టూనే జరిగాయి. చిత్ర హీరో శ్రీవిష్ణు అయితే ఒకడుగు ముందుకేసి ‘పూనకాలు’ వచ్చే ఎపిసోడ్స్ అంటూ ఫ్యాన్స్ ను మరింత ఉత్తేజపరిచారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతా నీరసించిపోయారు.

కంటెంట్ లో బలం లేకపోతే జూనియర్ ఎన్టీఆరే కాదు, ఏ స్టార్ హీరో కూడా ఏ సినిమాను రక్షించలేరని మరోసారి “అర్జున ఫల్గుణ” చిత్రం ద్వారా నిరూపితమైంది. అలాగే ‘వాలెంటైర్’పై వేసిన సైటెర్ డైలాగ్స్ కూడా పండకపోవడంతో, కేవలం అవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ గానే మిగిలిపోయాయి. ఈ సినిమాతో వచ్చిన ‘బాడ్ నేమ్’ను తదుపరి చిత్రం “భళా తందనాన”తో శ్రీవిష్ణు తుడిపేసుకుంటారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories