శ్రీలీలను ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది ?

Sreeleela Trolled After Lenin Hit? Here's the Real Story

అఖిల్ ఎట్టకేలకు ఒక కమర్షియల్ హిట్ అందుకున్నాడు ఆనందం. నటుడిగా అఖిల్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు మహదానందం. అక్కినేని అభిమానులు మాత్రమే కాదు సగటు తెలుగు సినిమా అభిమానులు కూడా అఖిల్ హిట్ కొట్టాడన్న విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేసారు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. “లెనిన్” సినిమా హిట్ అయ్యిందని శ్రీలీలని ట్రోల్ చేయడం వెనుక కారణం ఏంటి అనేది మాత్రం అర్థం కాలేదు. “లెనిన్” సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. విడుదలైన టీజర్ లోనూ శ్రీలీల ఉంటుంది.

ADVERTISEMENT

అయితే.. డేట్స్ కారణమో లేక మరింకేదైనా కారణమో శ్రీలీల సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది.

కాకపోతే.. శ్రీలీల లేదు కాబట్టి సినిమా హిట్ అయ్యింది, శ్రీలీల ఉంటే ఇది కూడా కామెడీ సినిమాలా అయిపోయేది, శ్రీలీల భారతీ పాత్రకి న్యాయం చేసేది కాదు అంటూ వస్తున్న కామెంట్స్ కేవలం శ్రీలీల టార్గెట్ గా జరుగుతున్న ట్రోలింగ్ అని స్పష్టమవుతోంది.

ఒక హీరోయిన్ వల్ల సినిమా హిట్ అవ్వడమో లేక ఫ్లాప్ అవ్వడమో జరగదు. ఒక సినిమా ఆడాలంటే అన్నీ కలిసి రావాలి. లేడీ లక్, ఐరెన్ లెగ్ అనేవన్నీ కేవలం చెప్పుకోవడానికి కొన్ని మాటలు మాత్రమే.

సో, “లెనిన్” విషయంలో శ్రీలీలను ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కమర్షియల్ సక్సెస్ దొరక్కపోవడం, వరుస పరాజయాలు అందుకోవడం తప్పిస్తే.. ప్రతి సినిమాకి డ్యాన్సుల విషయంలో తన బెస్ట్ ఇస్తూ, ప్రమోషన్స్ లోనూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే శ్రీలీలకు కావాల్సినదల్లా ఒక్క హిట్టు సినిమా. అది ఆమె తదుపరి చిత్రాల ద్వారా లభించాలని కోరుకుందాం.

ADVERTISEMENT
Latest Stories