పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టిన శ్రీరెడ్డి ప్రశ్న

Sri Reddy Allegations on Pawan Kalyan - Chiranjeeviజనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు వివాదాస్పద నటి శ్రీరెడ్డి నుంచి ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతున్నట్లుగా ఉంది.మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం సందర్భంలో కాంగ్రెస్ నేతలు తమ ఆడ బిడ్డను బజారుకు ఈడ్చారని, మోసం చేసి ఢిల్లీ వరకు తమ కుటుంబ విషయాన్నీ రియాలిటీ షో చేసేశారని, వారి ఇంట్లో ఆడ బిడ్డలు లేరా అని ఆయన ఆవేశంగా అన్నారు.

ADVERTISEMENT

అయితే దానిపై స్పందిస్తూ చిరంజీవి ఇంకా ఎందుకు కాంగ్రెస్ లో ఉన్నారని ఆమె ప్రశ్నించారు. పదహారేళ్లు పెంచుకున్న పాపని కాంగ్రెస్‌ నాయకులు మోసపూరితంగా ఢిల్లీలో జాతీయ చానెళ్ల ఎదుట కూర్చోబెడితే మా కడుపు ఉడికిపోయిందన్న పవన్‌ కళ్యాణ్‌..మరి మీ అన్న ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారని ఆమె అన్నారు.

ఆయన అబిమానుల ద్వారా ఓట్ల కోసం మీకు ఎలా సాయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.మీ అన్న సిగ్గు పడడం లేదా?అన్నం పెట్టేవాడికి సున్నం వేస్తారా అని ఆమె అన్నారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలు కొంత కటువుగా ఉన్నా పవన్ కళ్యాణ్ నూ చిరంజీవి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవే అని అనుకోవాలి. అయితే అసలు చిరంజీవి కాంగ్రెస్ లో ఉండగా పవన్ కళ్యాణ్ ఆ విషయం ఎత్తకుండా ఉండాల్సింది

ADVERTISEMENT
Latest Stories