నాచురల్ స్టార్ నానిని టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేస్తోన్న సంచలన ఆరోపణలు తెలిసిందే. నాని ఎవరెవరితో తిరిగాడో, నాతో ఎలా ఉన్నాడో అవన్నీ త్వరలో బయటపెడతా అంటూ సందేశాలు, వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. నాని లైంగిక ఆరోపణలు సంగతి తెలియాలంటే, సాక్ష్యాలతో సహా శ్రీరెడ్డి పోస్ట్ చేస్తే తప్ప వెలుగులోకి రాదు గానీ, నానిపై మరో ఆరోపణ కూడా శ్రీరెడ్డి చేస్తోంది.
తమకు వచ్చే అవకాశాలను తోక్కేస్తున్న నాని ఎలాంటి వాడో అందరికీ తెలియాలి అంటూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే నానికి నిజంగా వేరొకరి సినిమాల ఆఫర్లను తొక్కే సీన్ ఉందా? అన్నది ఆశ్చర్యకరంగా మారింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంగా ఎదిగిన నాని, ఇండస్ట్రీలో మరొకరిని నిజంగా తొక్కే అంత బలాన్ని సమకూర్చుకున్నారా? ఏమో… శ్రీరెడ్డి ఆరోపణల ప్రకారం అయితే అలా ఉంది గానీ, ఈ నాచురల్ స్టార్ పై అలాంటి ఆరోపణలు నమ్మశక్యంగా అయితే లేవు.



