సినీ ఇండస్ట్రీలో ‘టాలెంట్’ కంటే ‘సక్సెస్’కే ప్రాధాన్యత ఎక్కువ అన్న విషయం బహిరంగమే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయంలోనూ అదే జరిగిందని చెప్పాలి. ‘కొత్త బంగారు లోకం’ వంటి సూపర్ సక్సెస్ ఫుల్ చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత కూడా శ్రీకాంత్ కు ఆశించిన ఆఫర్లు అందలేదు. అయితే ప్రిన్స్ మహేష్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న శ్రీకాంత్ ఏకంగా టాలీవుడ్ కు మల్టీస్టారర్ ట్రెండ్ నే పరిచయం చేసాడు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అద్భుత విజయం సాధించిన తర్వాత కూడా శ్రీకాంత్ రేంజ్ పెరగలేదు. మెగా వారసుడు వరుణ్ తేజ్ ను పరిచయం చేస్తూ చేసిన ‘ముకుంద’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో మరోసారి మహేష్ బాబే అవకాశం ఇవ్వడం, అది ‘బ్రహ్మోత్సవం’గా రూపాంతరం చెందడం జరిగిపోయింది. అయితే మళ్ళీ ‘బ్రహ్మోత్సవం’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఎవరినీ దర్శకత్వం వహించబోతున్నారు? అన్న ప్రశ్న తలెత్తితే…
మళ్ళీ మహేష్ బాబే అన్న సమాధానం ట్రేడ్ వర్గీయుల నుండి వస్తోంది. అయితే ఇప్పటికే ప్రిన్స్ పలు సినిమాలకు కమిట్ అయి ఉండడంతో అవి పూర్తయిన తర్వాత… బహుశా మరో ఒకట్రెండు సంవత్సరాలు పట్టవచ్చని సమాచారం. అయితే ఈ లోపున శ్రీకాంత్ మరో బిగ్ స్టార్ కు స్టోరీ వినిపించబోతున్నారని, అది కార్యరూపం దాలిస్తే… మహేష్ కంటే ముందు ఆ “బిగ్ స్టార్” ఉండవచ్చని తెలుస్తోంది. ఒకప్పుడు ‘మూస’ పంథాలో సాగిన ఆ ‘స్టార్ హీరో’ ఇటీవల కాలంలో కొత్త కధలకు ఓటేస్తున్నారని టాక్.



