‘శివరాత్రి’ రోజు ‘శ్రీమంతుడు’కు భారీ స్పందన!

srimanthudu-top-2015-filmప్రిన్స్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” సినిమా ‘మహాశివరాత్రి’ రోజు సందడి చేసింది. భక్తులు జాగారం ఉండే రోజు కావడంతో హిట్ సినిమాలను తెల్లవారే సమయం వరకు ధియేటర్ యాజమాన్యాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే కొరటాల శివ – ప్రిన్స్ కాంభినేషన్ లో తెరకెక్కిన “శ్రీమంతుడు” సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 27 స్పెషల్ షోలు వేయడం విశేషం. ప్రదర్శించడమే కాదు, అభిమానులు ఈ సినిమాకు మళ్ళీ బ్రహ్మరధం పట్టారు. విడుదల రోజు ఉండే హంగామా మాదిరి “శ్రీమంతుడు” ధియేటర్ల వద్ద జనసందోహంతో కోలాహల వాతావరణం నెలకొంది. ధియేటర్ల బయట ఎంత సందడి చేసారో, లోపల అంతకంటే ఎక్కువ హంగామా సృష్టించారు ప్రిన్స్ ఫ్యాన్స్.

ADVERTISEMENT

సినిమాలో హైలైట్స్ భాగాలైన ఢిల్లీ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఫైట్ సీన్, మామిడితోట సన్నివేశాలకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. సహజంగా శివరాత్రి రోజు భారీ హిట్ అయిన సినిమాలను ప్రదర్శించడం కామనే అయినప్పటికీ, “శ్రీమంతుడు” సినిమాకు అంతకు మించిన స్పందన లభించింది. దీంతో అభిమానులు తీసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Srimanthudu Shivaratri Special Shows -1

Srimanthudu Shivaratri Special Shows -2

Srimanthudu Shivaratri Special Shows -3

ADVERTISEMENT
Latest Stories