ఆశలన్నీ ఈవీవీ క్రేజీ టైటిల్ పైనే!

Srinivas Redy Hopes on Jambalakadi Pambaఈవీవీ సత్యనారాయణ అందించిన అత్యద్భుతమైన కామెడీ ఆణిముత్యాలలో “జంబలకిడి పంబ” కూడా ఒకటి. అప్పట్లో ఒక సంచలనంగా నిలిచిన ఈ సినిమా పేరుతో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో ఓ హాస్యభరితమైన సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ పెద్దగా ఆకట్టుకోలేనప్పటికీ, ఈవీవీ టైటిల్ పై క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.

మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డికి జతగా సిద్ధి ఇద్నాని నటించగా, ఇతర ప్రధాన పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘గీతాంజలి’ కమర్షియల్ సక్సెస్ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బెడిసికొట్టడంతో ప్రస్తుతం ఆశలన్నీ ‘జంబ లకిడి పంబ’ మీదే పెట్టుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories