హేయ్… శ్రీను వైట్ల కూడా వేసేసాడు..!

Srinu Vytla - Mister interview News‘ఆగడు, బ్రూస్ లీ’ చిత్రాల వరుస ఫ్లాప్ ల తర్వాత విమర్శకులు ఓ రేంజ్ లో ఆడుకున్న దర్శకుడిగా శ్రీను వైట్ల నిలిచిపోయారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా, ఆత్మవిశ్వాసం కోల్పోని శ్రీను వైట్ల తాజాగా “మిస్టర్” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… ‘బ్రూస్ లీ’ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాన్ని చెప్పారు. అయితే ఇదేదో రొటీన్ కారణమైతే, విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదు గానీ, ఈ కారణంలో శ్రీను వైట్ల ఓ ‘హింట్’ మాత్రం అందించారు.

‘బ్రూస్ లీ’ సినిమా విషయంలో ‘నేను అనుకున్నట్లుగా చేసే పరిస్థితులు లేకుండా పోయాయప్పుడు’ అని శ్రీను వైట్ల చెప్పడం కలకలం రేపుతోంది. అంటే శ్రీను లెక్క ప్రకారం… తనకు తగినంత స్వేఛ్చను ఇవ్వలేదా? లేక సినిమా విషయంలో సహజంగా ఉండే ‘మెగా’ మంత్రం శ్రీనును డామినేట్ చేసిందా? అదీ కాకపోతే అప్పటివరకు దూరంగా పెట్టిన కోన వెంకట్ తో పని చేయడం శ్రీనుకు ఏ మాత్రం ఇష్టం లేదా? ఇలా శ్రీను చెప్పిన కారణం అనేక ప్రశ్నలను, సందేహాలను మిగిల్చింది.

ADVERTISEMENT

ఓ పక్కన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా సందర్భంగా చిరంజీవి తనకు అన్యాయం చేసాడంటూ నటుడు రాజ్ కిరణ్ వాపోవడం, ఇదే సమయంలో శ్రీను వైట్ల నుండి మరో ప్రకటన రావడంతో, దర్శకులకు మెగా హీరోలు కావాల్సిన ఫ్రీడంను ఇవ్వడం లేదన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ విషయంలో అధికారికంగా హల్చల్ చేస్తున్న ఈ టాక్, ఇతర మెగా హీరోలకు కూడా పాకితే, దర్శకులలో సృజనాత్మకత లోపించే ప్రమాదం లేదంటారా? ఇక దీనిపై మెగా కాంపౌండ్ పెదవి విప్పాల్సి ఉంటుంది..!

ADVERTISEMENT
Latest Stories