“ఊపిరి”పై రాజమౌళి ‘రివ్యూ’ – అద్భుతం!

secrets behind rajamouli padma sri awardకింగ్ నాగార్జున – కార్తిల మల్టీస్టారర్ “ఊపిరి” నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా జోరుమీదున్న నాగ్ తీరుతో ‘ఊపిరి’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ‘ఊపిరి’ని వీక్షించిన ‘జక్కన్న’ రాజమౌళి అద్భుతమైన సినిమాగా సర్టిఫికేట్ ఇచ్చేసారు.

“ఫ్రెంచ్ ఇన్ టచ్ బుల్స్ సినిమా తన ఫేవరేట్ సినిమాలలో ఒకటని, నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి సరిగా తీస్తారని అనుకోలేదని, తన నిర్ణయాన్ని తప్పు చేసినందుకు వంశీకి కృతజ్ఞతలు చెప్తున్నానని, సన్నివేశాల చిత్రీకరించిన విధానం సినిమా అద్భుతంగా వచ్చేలా చేసిందని, కార్తి నటన బాగుందని, నాగ్ నిజమైన పాత్ బ్రేకింగ్ హీరో అని, నిర్మాత పివిపికి, ‘ఊపిరి’ సినిమా యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్తూ… చాలా కాలం మనతో ఉండిపోయే ఫుల్ ఎంటర్టైనర్ సినిమా, ఎవరూ మిస్ అవ్వద్దు…” అంటూ జక్కన్న చేసిన రివ్యూ “ఊపిరి” సినిమాకు ఇంకాస్త ఊపిరినిచ్చిందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories