తెలుగుని ‘లైట్’ తీసుకున్న రాజమౌళి!

SS-Rajamouli RRR Movie Promotionsజనవరి 7వ తేదీన “ఆర్ఆర్ఆర్” రిలీజ్… ఇది పక్కా..! ఓమిక్రాన్ రూపంలో కరోనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా లేక ఇతర రాజకీయ ఇబ్బందులు తలెత్తినా, ఇందులో ఎలాంటి మార్పు ఉండడం లేదన్న విషయం ఖరారయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది, రిలీజ్ కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరి ‘రాజమౌళి అండ్ కో’ ఎక్కడ? అంటే…

ఏ ముంబై లోనో, చెన్నైలోనో, కేరళలోనో లేదంటే కర్ణాటక… ఇలా విడుదలవుతున్న ప్రతి భాషలో ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నారు. నేడు కేరళలో జరుగుతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయితే ఏకంగా సీఎం పినరయ్ విజయన్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారంటే, రాజమౌళి ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్న స్థాయిలో బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ ను పూర్తి చేసారు. ఓమిక్రాన్ రూపంలో కరోనా ఎలాంటి అడ్డంకులు సృష్టించకపోతే, ఓపెనింగ్ ఫిగర్స్ నమ్మశక్యం కానంత స్థాయిలో ప్రమోషన్స్ ను ఇచ్చారు. అలాగే హీరో శివ కార్తికేయన్ ముఖ్య అతిధిగా చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

అన్ని చోట్లా అద్భుతంగా ప్రమోషన్స్ ఇస్తోన్న రాజమౌళి, మరి మన తెలుగు విషయానికి వచ్చేపాటికి పూర్తిగా ‘లైట్’ తీసుకున్నట్లుగా కనపడుతోంది. ధియేటర్లలో నేరుగా ట్రైలర్ రిలీజ్ చేసి అభిమానులను ధియేటర్ కు రప్పించగలిగారు గానీ, ప్రత్యక్షంగా తమ అభిమాన హీరోలను చూసుకునే భాగ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు కలిగించలేకపోయారు.

ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’పై కావాల్సినంత బజ్ ఉన్న మాట వాస్తవమే గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల గురించి అతిధులు చెప్పే ముచ్చట్లు, సినిమా గురించి చెప్పే సంగతులతో అభిమానులకు వచ్చే జోష్ వేరు కదా! అలాంటి ఊపు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పకనే చెప్పింది. బాలయ్య – బోయపాటి కాంబోపై భారీ అంచనాలు ఏర్పడినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వచ్చాక ఏర్పడిన ‘హై’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!

తెలుగు హీరోలే కాబట్టి కావాల్సినంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉండదన్న భావనలో రాజమౌళి ఉండొచ్చు గానీ, సినిమా రిలీజ్ అయ్యే సమయంలోనే కదా తమ హీరోలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్ కు కలుగుతుంది. సాధారణంగా ఒక అగ్ర హీరో పాల్గొంటేనే మన ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది నందమూరి – మెగా కాంబో హీరోలను ఒకే వేదికపై ప్రత్యక్షంగా చూడడం ద్వారా వచ్చే హైప్ అభిమానులకు ఏ ధియేటిరికల్ ట్రైలర్ కూడా ఇవ్వదు.

అందుకే “ఆర్ఆర్ఆర్” తెలుగు ప్రమోషన్స్ ను ‘లైట్’గా తీసుకోవద్దని అంటున్నారు ‘నందమూరి – మెగా’ ఫ్యాన్స్. ‘రాజమౌళి అండ్ కో’ కూడా ఈ ఈవెంట్ కు సంబంధించి ప్లానింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గానీ, అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా కొత్త ఏడాదిలో సరికొత్త ట్విస్ట్ ఇస్తూ ఎలాంటి ప్రకటన అయినా వస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories