అనుకున్నదంతా అయ్యింది! విద్యార్ధులంతా అరెస్టయ్యారు!

students arrested for celebrating beef festival in osmania universityఉస్మానియాలో ‘బీఫ్ ఫెస్టివల్’ వంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేస్తూ పలువురు విద్యార్ధులు ఉస్మానియాలో ‘పెదకూర’ పండుగను నిర్వహించి, దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. అంతేకాదు, ఇది తమ ఘనవిజయంగా చాటుకున్నారు.

అయితే 24 గంటలు ముగిసే సమయానికి సీన్ రివర్స్ అయ్యింది. విజయోత్సాహంతో పొంగిపోయిన 12 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేసారు. సాక్షాత్తు హైకోర్టు ఉత్తర్వులనే ఉల్లంఘించడంతో అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి అని పోలీసులు చెప్పగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేసారు. అయితే ఈ పరిస్థితి తలెత్తుతుందని విశ్లేషకులు ముందుగానే అంచనా వేసి విద్యార్ధి లోకాన్ని హెచ్చరించారు.

ఉడుకు రక్తంలో ఉన్న విద్యార్ధులు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసుకుంటూ ఇలాంటి అల్లరి, చిల్లర కార్యక్రమాల్లో పాల్గొనడం పరిపాటిగా మారిందని పలువురు వక్తలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. కనీసం తల్లితండ్రులైనా వారి బిడ్డలకు సర్ధిచెప్పుకోవాలని ఈ సందర్భంగా హితవు పలుకుతున్నారు. చట్టపరమైన చర్యలు ఇలా ఉంటే, బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొంటే, అడ్మిషన్లను రద్దు చేస్తామన్న ఉస్మానియా రిజిస్టార్ ఎలాంటి చర్యలు చేపడతారోనన్న ఆందోళన విద్యార్ధి లోకంలో వ్యక్తమవుతోంది. అందుకే అంటారు… “అడుసు తొక్కనేలా… కాలు కడగనేలా..!” అని!!

ADVERTISEMENT
Latest Stories