నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా “కార్తీకేయ” ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఓ గుడి చుట్టూ అల్లుకున్న ఈ కధను చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులకు చూపించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. బహుశా ఈ స్ఫూర్తితోనే “సుబ్రహ్మణ్యపురం” సినిమాకు శ్రీకారం చుట్టారో ఏమో గానీ, తాజాగా విడుదల చేసిన టీజర్ ‘కార్తీకేయ 2’ మాదిరి కనపడుతోంది.
[m9ad]
ADVERTISEMENT
దేవుడిని విశ్వసించని హేతువాదిగా సుమంత్ కనిపిస్తున్న ఈ సినిమాలో కూడా కధ అంతా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి చుట్టూ తిరుగుతుందన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా ఈ టీజర్ లో చూపించారు. ఆ దేవాలయం వెనుక ఉన్న మిస్టరీని దర్శకుడు సంతోష్ జాగర్లమూడి ఎంత ఆసక్తికరంగా చూపించారో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే. సుమంత్ కెరీర్ లో ఇది 25వ సినిమా.
ADVERTISEMENT



