క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును మరెవరూ కొట్టలేరు!

Sujan Ahmed Cricket World Record Wides Nobesక్రికెట్ లో అద్భుతాలు జరగడం సహజమే గానీ, అసలు అద్భుతానికి కూడా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటే, వాటినేమంటారు? ప్రస్తుతం ఓ బంగ్లాదేశ్ బౌలర్ అలాంటి రికార్డునే కైవసం చేసుకున్నాడు. ఇక మున్ముందు చరిత్రలో ఎవరూ కొట్టలేని విధంగా ఓ చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్నాడు. ఢాకా సెకండ్‌ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌ లో ఓ బౌల‌ర్ కేవలం 4 బంతులు సంధించి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నాడు.

ADVERTISEMENT

లీగ్‌ లో భాగంగా ఆక్సియమ్‌ – లాల్మాటియా క్లబ్‌ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంద‌ర్భంగా లాల్మాటియా జట్టు ఓపెనింగ్‌ బౌలర్‌ సుజన్‌ మహ్మద్ బౌలింగ్‌లో ఈ రికార్డు న‌మోదైంది. తొలి ఓవ‌ర్‌లో బౌలింగ్ చేసిన మ‌హ్మ‌ద్, మొత్తం 15 నో బాల్స్‌ వేశాడు. అలాగే ఈ క్రమంలోనే మరో 13 వైడ్లు వేయగా ఆ బంతులన్నీ బౌండరీలు దాటాయి. ఇక నాలుగు బాల్స్‌ లో 12 పరుగులు ఇచ్చుకున్నాడు.

మొత్తం 80 ప‌రుగులు ఎక్స్‌ ట్రాల రూపంలో వ‌చ్చాయి. దీంతో 4 బంతుల‌కే మొత్తం 92 పరుగులు వచ్చాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన లాల్మాటియా జ‌ట్టు 14 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ కాగా, తొలి ఓవర్‌ మొదటి నాలుగు బంతులకే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. అయితే లాల్మాటియా క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ అదనన్‌ రెహమాన్‌ ఈ విషయంపై మాట్లాడుతూ…

తాము కావాలనే ఇలా చేశామని, ఈ మ్యాచ్ లో టాస్‌ ఎవరు గెలిచారో కూడా తమ కెప్టెన్‌ ను అంపైర్లు చూడనివ్వలేదని, అసహనంతో 4 బంతుల్లోనే మ్యాచ్‌ ను ముగించేశామని సమర్ధించుకున్నారు. ఏది ఏమైనా క్రికెట్ చరిత్రలో ఇంత చెత్త రికార్డు మాత్రం మరోసారి నమోదు కాదని, క్రీడా విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కనీసం ఊహకు కూడా అందని రికార్డు సదరు బౌలర్ వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories