సుకుమార్ అంచనాలు తప్పినట్లేగా!

సుకుమార్ అంచనాలు తప్పినట్లేగా!ఈ సినిమాను నేను తెలుగు సినిమాగానే చూసాను, నేను అన్ని లాంగ్వేజెస్ లో వచ్చే సినిమాగా చూడలేదు, కానీ బన్నీ, నిర్మాతలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని పట్టుబట్టారు. ‘మల్లు అర్జున్’ కాబట్టి ఓకే మలయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగులో ఆడుద్ది అనుకున్నాను.

నేపాల్ కాపీ వెళ్ళిపోవాలి… నేపాల్ కు కాపీ వెళ్ళిపోవాలి… అని కంగారు పెడుతున్నారు. నేపాల్ కు కాపీ ఏంటిరా, ఎందుకు వెళ్తుందిరా? లోపల నేను చూస్తున్నా… యూపీ, బీహార్, అస్సాం వెళ్ళిపోవాలి అంటుంటే అంత లేదమ్మా… మీరు నమ్మరు నేను లోలోపల నవ్వుకుంటున్నాను. నాకు అసలు నమ్మకమే లేదు – ఇది “పుష్ప” థాంక్యూ మీట్ వేదికగా దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు.

ADVERTISEMENT

కట్ చేస్తే… సినిమా రిలీజ్ అయ్యి 16 రోజులు గడిచిన తర్వాత బాలీవుడ్ లో ఒక రోజులో “పుష్ప”కు వచ్చిన ఫిగర్స్ 6.10 కోట్లు. ఒక్క రోజులో హిందీలో “పుష్ప” సాధించిన కలెక్షన్స్ ఇవి. మొత్తంగా 16 రోజులకు గాను 56.69 కోట్లు కొల్లగొట్టి 75 కోట్లు సాధించే దిశగా “పుష్ప” పయనిస్తుండడం ఎవరూ అంచనాలు వేసింది కాదు. సంక్రాంతికి వరకు ఇదే ఒరవడి కొనసాగితే 100 కోట్లు అందుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

నిజంగా ఈ స్థాయి కలెక్షన్స్ “పుష్ప”కు హిందీలో వస్తాయని ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. సుమిత్ కడేల్ అయితే ఓపెనింగ్స్ 50 లక్షల నుండి 1.50 కోట్లు వరకు ఉంటాయని అంచనా వేయగా, తొలిరోజున అంతకు రెట్టింపు కలెక్షన్స్ అందుకుని నానాటికి బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప’ దూసుకుపోతోంది.

సుకుమార్ నిజంగానే అల్లు అర్జున్ ను తక్కువ అంచనా వేశారని చెప్పాలి. థాంక్యూ మీట్ లో స్వయంగా సుకుమార్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ మాటకొస్తే ఒక్క సుకుమారే కాదు, ఎవ్వరూ కూడా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంచనా వేయలేకపోయారు. ఏ ఒక్కరైనా నమ్మారు అంటే, అది ఒక్క రాజమౌళి మాత్రమే అయ్యుండాలి.

ఎందుకంటే “బాహుబలి” రెండు భాగాల ద్వారా హిందీ మార్కెట్ ను సంపూర్ణంగా అంచనా వేసిన టాలీవుడ్ వ్యక్తి ఒక్క రాజమౌళి మాత్రమే. అందుకే ‘పుష్ప’ను బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేయమని అల్లు అర్జున్ కు, ఖచ్చితంగా రిలీజ్ చేయమని సుకుమార్ కు సలహా ఇచ్చారు. కారణం ఎవరైనా మన తెలుగు కెరటం మరో దగ్గర ఎగుతుండడం మనందరికీ గర్వకారణమే కదా!

ADVERTISEMENT
Latest Stories