సంక్షోభంలో సుకుమార్.. కెరీర్లో ఇదే మొదటిసారి

Sukumar Next Movie

ఒక స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన విషయమే. అందులోనూ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టాక పరిస్థితి ఎలా ఉంటుందంటే.. సదరు దర్శకుడు నెక్స్ట్ ఏ స్థాయి సినిమా తీస్తాడా అనేది మరింత ఆసక్తికరమైన విషయంగా మారుతుంది.

అయితే.. సుకుమార్ విషయంలో ఈ నెక్స్ట్ ఏంటి అనేది మరింత క్లిష్టమైన విషయంగా మారింది. నిజానికి “ఆర్ఆర్ఆర్” టైంలోనే రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసాడు సుకుమార్. రాజమౌళి అయితే ఏకంగా రామ్ చరణ్ తో సుకుమార్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ సీన్ కూడా షూట్ చేసేశాడని, అది మాములుగా లేదని భీభత్సమైన హైప్ ఇచ్చేశాడు.

ADVERTISEMENT

దాంతో.. అప్పటి నుండే సుకుమార్-చరణ్ కలయికలో తెరకెక్కే రెండో సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. కానీ.. ఆ అంచనాలకు “గేమ్ ఛేంజర్, పెద్ది” సినిమాలు బ్రేక్ వేశాయి. మరీ ముఖ్యంగా “పెద్ది” అనేది సుకుమార్ జడ్జిమెంట్ ని కూడా ఇరకాటంలో పెట్టింది.

ఎందుకంటే.. చరణ్ తో సుకుమార్ ఎలాంటి సినిమా తీస్తాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ఎందుకంటే.. ఆల్రెడీ చరణ్ రస్టిక్ సినిమాలు చేసేసి ఉన్నాడు కాబట్టి, సుకుమార్ అలాంటి సినిమాలు చేయలేడు. చేసినా ఇంట్రెస్ట్ రాదు. మరి సుకుమార్ ఎలాంటి సినిమా చేయాలి?

ఏదైనా కొత్తగా చేద్దామని సుకుమార్ చేసిన ప్రయత్నాలు “నాన్నకు ప్రేమతో, ఒన్ నేనొక్కడినే” సినిమాల రిజల్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఆ రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ప్రయోగాలు చేయకుండా ఉంటాడా?

ఎందుకంటే.. జానర్ లేదా పాయింట్ ఫిక్స్ అయితేనే ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేయగలరు. మరి సుకుమార్ ఆల్రెడీ ఫిక్స్ అయిన జోనర్ కే కమిట్ అవుతున్నాడా? మరి అలా కమిట్ అయితే అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేయడానికి లేదా షూటింగ్ కి వెళ్లడానికి ఇంత డిలే ఎందుకు చేస్తున్నాడు? సుకుమార్ ఎలాంటి సినిమా చేయాలి అనే సంక్షోభంలో ఉన్నాడా? అనిపిస్తోంది. బహుశా సుకుమార్ కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారేమో.

ADVERTISEMENT
Latest Stories