పెద్ది కి ఆగిన సుక్కు, ఈ సినిమాకి ఓపెన్!

Sukumar Praises Rao Bahadur

“పెద్ది” సినిమా విషయంలో సుకుమార్ సక్సెస్ మీట్ వరకు ఎందుకు స్పందించలేదు? అనే ప్రశ్న అందరి నోళ్లలోనూ నలిగింది. అందులోనూ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించి కూడా సినిమాకి సంబంధించి రిలీజ్ తర్వాత ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు సుకుమార్. దాంతో సుకుమార్ కి కూడా సినిమా నచ్చలేదని, అందుకే సైలెంట్ గా ఉన్నాడని కొందరు. సినిమా విషయంలో జరిగిన రచ్చలో సుకుమార్ ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదని, అందుకే దూరంగా ఉంటున్నాడని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఎట్టకేలకు సక్సెస్ మీట్ లో సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడి హడావుడి నుండి తప్పించుకున్నాడు సుకుమార్.

అయితే.. వచ్చేవారం విడుదల కాబోతున్న “రావ్ బహదూర్” సినిమా చూసిన సుకుమార్.. సినిమాని, నటుడు సత్యదేవ్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు. సత్యదేవ్ ను చూసిన ప్రతి ఆర్టిస్ట్ జలసీ ఫీలవుతాడని, అసలు “రావ్ బహదూర్” లాంటి సినిమా తెలుగులోనే కాదు ఇండియాలోనే ఇప్పటివరకు రాలేదని కితాబులిచ్చాడు సుక్కు.

ADVERTISEMENT

దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు సుక్కు మీద సీరియస్ అవుతున్నారు. “పెద్ది” విషయంలో అంత సైలెంట్ గా ఉండి, ఇప్పుడు “రావ్ బహదూర్”నీ మాత్రం తెగ పొగిడేస్తున్నాడు సుక్కు అంటూ సుక్కు మీద గుర్రుమంటున్నారు. అయితే.. రామ్ చరణ్ తడుపరి చిత్రం #RC17 దర్శకుడు సుకుమార్ కాబట్టి, గట్టిగా ఏమీ అనలేకపోతున్నారు.

ఏదేమైనా.. సుకుమార్ ఇచ్చిన బూస్ట్ “రావ్ బహదూర్”కి హెల్ప్ అవుతుండగా.. “పెద్ది” విషయంలో స్పందించకపోవడం అనేది మెగా అభిమానుల మనసులో ఒక నెగిటివ్ పాయింట్ గా మిగిలిపోయింది.

ADVERTISEMENT
Latest Stories