కాస్టింగ్ కౌచ్ పై…అలా అనేశాడేంటి!

Suman on casting couchకాస్టింగ్ కౌచ్ పై ఎప్పటికప్పుడు రకరకాల మాటలు వింటూనే వున్నాం…మోస పోతున్నాం అంటూ తారలు అంటూ ఉంటే..అసలు మోస పోయే ఛాన్స్ లేదు అని కొందరి వాదన. మరో పక్క అసలు కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు అనేది మరి కొందరి వాదన.

ఇదిలా అంటే తాజాగా తమిళ హీరో కమ్ విలన్ అర్జున్ పై వచ్చిన ఆరోపణల గురించి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఆరోపణలపై సీనియర్ హీరో సుమన్ ని మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “ఆధారాలు ఉన్నాయా..చూపించండి అప్పుడే నమ్ముతా” అంటూ మీడియాని ఎదురు ప్రశ్నించారు.

ADVERTISEMENT

మరో పక్క అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడున్న వారి వల్లనే జరుగుతుంది. రాత్రికి రాత్రే హీరోయిన్స్ అయిపోవాలి అన్న తపనతో, అమాయకత్వంతో అవతలివారికి లొంగిపోతున్నారు అని సుమన్ ఇప్పటి తారల గురించి తనదైన శైలిలో స్పందించారు.

అంతేకాదు మా కాలంలో అసలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు ఉండేవి కాదు అంటూ తెలిపారు ఆయన. మొత్తంగా చూస్తే సుమన్ మాట్లాడిన మాటల్లో తప్పు అంటా అవకాశాలు కోసం అన్నీ అర్పిస్తున్న వారిదే కానీ, అడిగే వారిది కాదు అని తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories