తన ఇటీవలే చిత్రం, నిను వీడని నీడను నేనే తో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న యువ హీరో సందీప్ కిషన్ మరో చిత్రాన్ని పట్టాల మీదకు ఎక్కించారు. A1 ఎక్స్‌ప్రెస్ తో వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఓ స్టేడియం ముందు సందీప్ కిషన్ చేతిలో హాకీ స్టిక్‌ను పట్టుకుని ఉన్న పోస్టర్ ను ప్రీ-లుక్ గా విడుదల చేశారు.
హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిది. ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు గతంలో షార్టు ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. నవంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. తొందరలో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయి.
సినిమాలోని హీరోయిన్ ను, మరియు ఇతర నటీనటులను ఫైనల్ చెయ్యాల్సి ఉంది. గతంలో వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో పెద్ద హిట్ కొట్టిన సందీప్ కిషన్ ఈ A1 ఎక్స్‌ప్రెస్ తో ఏం చెయ్యబోతున్నాడో చూడాలి.





