చంద్రబాబు ఒక గజదొంగ

sunil-deodhar-andhra-pradeshబీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ అతిగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చెయ్యడానికి రాష్ట్రానికి పంపబడ్డ ఆయన చంద్రబాబుని తిట్టే పనిలోనే ఉంటున్నారు. తాజాగా ఆయన పలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక గజదొంగ అని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు సంబంధించిన అవినీతి కేసులను బయటకు తీసి విచారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.

త్వరలోనే అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అప్పుడు కేంద్రం రాష్ట్రాన్ని దోచుకున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తమని తాము కాపాడుకోవడానికి నేతలు బీజేపీలో చేరుతున్నారు అనే దాని మీద కూడా ఆయన స్పందించారు. అవినీతికి పాల్పడిన నేరస్తులు ఏ పార్టీలో ఉన్నా శిక్షించబడాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా మార్చడానికి జగన్ నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

ADVERTISEMENT

టీడీపీ చేసిన అవినీతిని వెలికితీయాలని అనేక మీడియా సమావేశాల ద్వారా జగన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. చంద్రబాబుపై ఎవరికీ విశ్వాసం లేదన్నారు. అందుకే ఆయనపై సొంత పార్టీ ఎంపీ ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఖతం అయిపోయిందని, ప్రతిపక్ష పార్టీ శూన్యతను బీజేపీ త్వరలోనే భర్తీ చేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టే తాము పొత్తు తెంచుకున్నామని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందన్నారు. టీడీపీతో దాదాపుగా నాలుగున్నర ఏళ్ళు కలిసి కాపురం చేసి ఇప్పుడు అవినీతి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా?

ADVERTISEMENT
Latest Stories