40 సెకన్ల ‘మస్తీజాదే’ టీజర్ వెరీ హాట్ గురూ..!

sunny leone Mastizaade Teaser talkబాలీవుడ్ లో “గ్రాండ్ మస్తీ” సినిమా సృష్టించిన సందడి, మొత్తం సినీ పరిశ్రమనే మార్చేసింది. కేవలం డబుల్ మీనింగ్ డైలాగ్స్, హీరోయిన్ల అందచందాలతో 100 కోట్లు పైగా వసూలు చేసి, ‘ఔరా!’ అనిపించింది. ఇపుడు దీనికి 100 రెట్లు మించిపోయేలా “మస్తీజాదే” సినిమా సిద్ధమైంది. పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్, తుషార్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు సంబంధించి తొలి మోషన్ పిక్చర్ కు యూత్ నుండి మంచి స్పందన రావడంతో, తొలి టీజర్ ను విడుదల చేసారు.

‘డబుల్ మీనింగ్’ అన్న పదానికి అవకాశం లేకుండా డైరెక్ట్ గా ‘సింగిల్ మీనింగ్’తోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా అర్ధమవుతోంది. కేవలం 40 సెకన్ల టీజరే ఈ రేంజ్ లో ఉంటే, సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనన్న చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కారణం చేతనే ఈ సినిమా ఇన్ని వాయిదాలు పడి ఉంటుందన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.

మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015, మే 1వ తేదీ నుండి వాయిదాలు పడుతూ 2016, జనవరి 29వ తేదీకి విడుదల ముహూర్తాన్ని సెట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులే ఖంగు తిన్న ఈ సినిమాలో సన్నీ లియోన్ 27 సార్లు బికినీలో కనువిందు చేయనుందట. చూడబోతుంటే… “మస్తీ జాదే” 200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపడనవసరం లేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories