జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో సన్నీలియోన్ ‘న్యూడ్’ ఫోటో!

sunny leone photos in ghmcహాట్ అండ్ పోర్న్ బ్యూటీ అయిన సన్నీలియోన్ కు ఉన్న డిమాండ్ బాలీవుడ్ వరకే పరిమితం కాలేదు. ఇటీవల కాలంలో ఓ ప్రభుత్వ వెబ్ సైట్ లో చూసినా సన్నీ లియోన్ నగ్న సౌందర్యం తారసపడుతుండడం విశేషం. హ్యాకర్ల బారిన పడుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లలో ఈ ‘పోర్న్ బ్యూటీ’ ఫోటోలను పెడుతూ హ్యాకర్లు ఒక రకమైన ఆనంద పడుతున్నారు. తాజాగా వారి సంతోషానికి బలయ్యింది తెలంగాణా ప్రభుత్వానికి సంబంధించిన జీహెచ్ఎంసీ వెబ్ సైట్.

చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకల కోసం తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఓఎస్‌ఆర్టీ ఆప్షన్ రూపొందించింది. అయితే ఈ ఆప్షన్ పేజ్ ను ఓపెన్ చేసిన అధికారులకు సన్నీలియోన్ అందాలు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో తల పట్టుకున్న అధికారులు, వెనువెంటనే సాంకేతిక నిపుణులకు సమాచారం అందించారు.

ADVERTISEMENT

ఎవరో హ్యాకర్లు ఈ పని చేసి ఉంటారని, ఇటీవల కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ అయిపోయాయని టెక్నికల్ టీం అధికారులకు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. సన్నీలియోన్ ఫోటోను పోస్ట్ చేయడం మినహా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ ఇతర సమాచారంపై దృష్టి పెట్టకపోవడంపై ఎవరో ఆకతాయి ఈ పని చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారిక వెబ్‌సైట్‌లో సన్నీలియోన్ న్యూడ్ ఫోటో ఒక సెన్సేషన్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories