బెంగాలీ స్వీట్ VS ధమ్ బిర్యానీనా…?

ఎట్టకేలకు మళ్ళీ ఆరు ఏళ్ళ తరువాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ కు అర్హత ను సాధించింది. వారు 2018 లో విలియమ్సన్ నేతృత్వం లో ఫైనల్ గేటును తాకగా, మళ్ళీ ఆ మాదిరి ఆటతీరు ను చూపించటం లో ఆ జట్టు విఫలమయ్యింది.ఫైనల్స్ కు వెళ్లడం అటుంచితే గత మూడు సీజన్లుగా వారు కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేకపోయారు.

ADVERTISEMENT

ఇక జట్టు యాజమాన్యం, వారు లీగ్ ప్రారంభానికి ముందు జరిగే ఆక్షన్ లో తమ కెప్టెన్ ను మార్చాలి అనే ఉద్దేశం తో గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో తన కెప్టెన్సీ తో క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను ఏకంగా 20 కోట్ల 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుండే, హైదరాబాద్ ప్లేయర్స్ ఫియర్లెస్ క్రికెట్ ను అలవరుచున్నారు. కెప్టెన్ గా కమ్మిన్స్ సైతం చాలా సందర్భాలలో తన ఆక్షన్ ధర కు న్యాయం చేసాడు అనేలా కెప్టెన్సీ మార్క్ ఉంది.

మరోపక్క కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సీజన్ కు మెంటర్ పదవిని తమ మునుపటి టీం కెప్టెన్, మాజీ ఇండియన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కు అందజేశారు. అతను టీం లో చేసిన మార్పులు మరియు ఆటగాళ్లలో నింపిన స్ఫూర్తి, టీం మైదానం లో ఉన్నప్పుడు వారి నడవడిక ను చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఆ జట్టు లీగ్ స్టేజి పాయింట్స్ టేబుల్ లో మొట్ట స్థానాన్ని సంపాదించుకుని ప్లై ఆఫ్స్ కు అడుగుపెట్టారు.

ఆ జట్టు సైతం అన్ని విభాగాల్లోనూ ఎంతో పటిష్టంగా ఉంది. బాటింగ్ లో నరైన్, రస్సెల్, రింకు, ఇయర్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు బౌలింగ్ స్టార్క్, చక్రవర్తి, రానా వంటి విభిన్నమైన ఆడగడాళ్లతో బరిలో దిగుతున్నారు. ఇటు పక్క, హైదరాబాద్ చూసుకున్నా, బాటింగ్ మరియు బౌలింగ్ బలంగానే ఉన్నప్పటికీ, వారు ఈ టోర్నీ లో ఎక్కువగా బాటింగ్ బలం మీదనే ఆధారపడ్డారు.

ప్లే ఆఫ్స్ కు ఈ రెండు జట్లు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకుని అడుగుపెట్టగా, క్వాలిఫైయర్ లో హైదరాబాద్ కోల్కతా జట్టులు తలపడగా, ఆరోజున కోల్కతా జట్టు విజయాన్ని చాల సునాయాసంగా అందుకున్నారు. ఎలిమినేటర్ లో గెలిచిన రాజస్థాన్ తో హైదరాబాద్ తలపడగా, హైదరాబాద్ తమ పోరాట పటిమను చూపి విజయాన్ని అందుకున్నారు. చూడాలి మరి రేపు చెన్నై వేదికగా జరిగే ఫైనల్స్ లో కోల్కతా (బెంగాలీ స్వీట్) గెలుస్తుందా.? లేదా హైదరాబాద్ (దమ్ బిర్యానీ) గెలుస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories