మహానటి సావిత్రి బయోపిక్ సూపర్ సక్సెస్ కావడంతో, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారి బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్ళాయి. ఈ క్రమంలో మరికొందరి స్టార్ హీరోల బయోపిక్ లు కూడా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతికంగా తెలుగు ఇండస్ట్రీ నామరూపాలను మార్చేయడంలో కీలక భూమిక వహించిన సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరరూపం దాల్చుకొబోతుందన్న వార్త ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
[m9ad]
సూపర్ స్టార్ అల్లుడు సుధీర్ బాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అతి త్వరలోనే కృష్ణ జీవిత ఆధారంగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సుధీర్ బాబు పేర్కొన్నారు. బహుశా తాను స్థాపించిన నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’పై ఈ సినిమా నిర్మాణం జరుగుతుందేమో గానీ, సుధీర్ చేసిన ప్రకటనతో అభిమానులు ఆనందదాయకంగా ఉన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ రోల్ ను బాలకృష్ణ చేసినట్లే, మరి సూపర్ స్టార్ బయోపిక్ లో కృష్ణ పాత్రను మహేష్ బాబు చేస్తారా? అసలు ఈ బయోపిక్ కు ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రిన్స్ అభిమానులను వేధిస్తున్నా, ‘డేరింగ్ అండ్ డాషింగ్’కు నిలువెత్తు నిదర్శనం అయిన సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరరూపం సిద్ధించుకుంటే వీక్షించాలన్న ఆకాంక్ష అయితే ప్రిన్స్ అభిమానుల నుండి వ్యక్తమవుతోంది.



