తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డ సూర్య “24” సినిమా తొలి పాట మరో రెండు రోజుల్లో ల్యాండ్ అవబోతోంది. ఈ పాటకు సంబంధించిన స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఆ స్టిల్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలాకాలం తర్వాత రెహ్మాన్ అదిరిపోయే సంగీతం అందించారనే టాక్ రావడంతో “24” ఆడియో పరంగా కూడా సంచలనం సృష్టించడం ఖాయంగా కనపడుతోంది.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆడియో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఏప్రిల్ 6వ తేదీన సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ‘మనం’ సినిమా తర్వాత విక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఇటు తెలుగులో కూడా అన్ని వర్గాల నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.



