మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చే ఫోటోలు చాలా వస్తాయ్!

Sye-Raa---Amitabh-Bachchan---Latest-Updatesగడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్చల్ చేస్తోంది. “సైరా” సెట్స్ లో ఉన్న చిరంజీవి, అమితాబ్, రామ్ చరణ్ లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్న పిక్ సందడి చేస్తోంది. సినీ రచయిత సత్యానంద్ ఫేస్ బుక్ ద్వారా బయటకు వచ్చిన ఈ ఫోటో మెగా అభిమానులకు ఫీస్ట్ గా మారింది.

[m9ad]

ADVERTISEMENT

అయితే రాబోతున్న రోజుల్లో ఈ మెగా బ్రదర్స్ ఇద్దరూ చాలా విరివిగా కలుసుకుంటారని, అలాగే ఇలాంటి ఫోటోలు మరిన్ని అభిమానుల కోసం వస్తాయన్న టాక్ సినీ, పొలిటికల్ వర్గాల్లో బలంగా వినపడుతోంది. జనసేన రాజకీయ ప్రయోజనాల రీత్యా మెగా అభిమానులను ఏకం చేసేందుకు చేసే ప్రయత్నాలలో భాగమే ఇలాంటి ఫోటోలని పేర్కొంటున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయ్యుందని, దఫాల వారీగా వాటిని అమలు చేయడమే మిగిలి ఉందని,’ప్రజారాజ్యం’ సందర్భంలో అభిమానులను సరిగా వినియోగించుకోలేని మెగా ఫ్యామిలీ, జనసేనకు ఆ లోటు రాకుండా చూసే ప్రక్రియను పక్కాగా అమలు చేయనుందనేది అసలు న్యూస్.

ADVERTISEMENT
Latest Stories