మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మొదటి రోజు బాక్స్ ఆఫీసు వద్ద ఇరగదీసింది. చాలా చోట్ల బాహుబలి 2 తరువాతి స్థానంలో ఉంది. సినిమా టాక్ బావుండడంతో దసరా సెలవులు పూర్తి అయ్యే వరకూ సినిమా ధోకా లేదంటున్నారు. రివ్యూలు పాజిటివ్ గా ఉండడంతో ఓవర్సీస్ లో కూడా సినిమా ఇరగదీస్తుందని ట్రేడ్ అంచనా.
హిందీ వెర్షన్ చాలా తక్కువగా కాసులు రాబట్టినా మరో విధంగా బాలీవుడ్ ట్రేడ్ ని సైరా అబ్బురపరిచింది. సైరా అన్ని భాషల మొదటి రోజు కలెక్షన్లు కలిపితే బాలీవుడ్ సినిమా వార్ అన్ని భాషల కలెక్షన్లు కంటే ఎక్కువ. తెలుగు మార్కెట్ ఓపెనింగ్స్ భారీగా ఉండటంతో ఇది సాధ్యపడింది. కేవలం ఇండియా కలెక్షన్లే కాదు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను పరిగణించినా సైరాదే పైచెయ్యి.
ఇది కేవలం తెలుగు సినీ అభిమానుల సత్తా వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. మరోవైపు రెండో రోజు నుండే సైరా టీం ప్రమోషన్లు మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలోని ఒక స్టార్ హోటల్ లో ఈ రోజు ఉదయమే సైరా టీం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. రానున్న రోజులలో మరిన్ని ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుందని సమాచారం.
సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నెల 13 వరకూ దసరా సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. రివ్యూస్ బావుండటంతో ఓవర్సీస్ లో కూడా భారీ గా వసూళ్లు రాబడుతుందని అభిమానుల ఆలోచన.





