మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సినిమా చుసిన సెన్సార్ బోర్డు వారు యూఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఎటువంటి కట్స్ చెప్పలేదని తెలుస్తుంది. సినిమా విడుదలకు ఇంకా 10 రోజుల వ్యవధి ఉండటంతో ముందుగానే అన్ని ఏరియాలకు ప్రింట్స్ పంపడానికి తేలిక అవుతుంది. చివరి నిముషంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ముందు సెన్సార్ కు వెళ్లారు.
ఇప్పటివరకూ ఈ సినిమా ప్రమోషన్స్ లో వెనుకబడిందని ఫ్యాన్స్ అభిప్రాయం. నిన్నటి ప్రీ-రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇక నుండి ప్రమోషన్స్ కు కొదవ ఉండదని అభిమానులు అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ మర్కెట్స్ లో సినిమాను గట్టిగా ప్రమోట్ చెయ్యాల్సి ఉంది. లేకపోతే కష్టమే.
సాహూకు ప్రభాస్ దేశవ్యాప్తంగా రెక్కలు కట్టుకుని మరీ ప్రమోట్ చేశారు. తెలుగు కంటే ఎక్కువగా హిందీ వెర్షన్ కు ఎక్కువ ప్రమోషన్స్ చేసాడు. అయితే ఆ సినిమాతో పోల్చుకుంటే సైరాకు చెయ్యాల్సింది ఎంతో ఉంది. బాలీవుడ్ లో ట్రైలర్ ఈవెంట్ చెయ్యడం…. అక్కడి సూపర్ స్టార్లతో ట్రైలర్ ట్వీట్ చెయ్యడం వరకే చేశారు.





