మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అదే వేదిక నుండి చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యారు.
అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ వాయిదా పడింది అనే వార్తలు మెగా ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితుల వల్ల …. గోదావరి బొట్టు ప్రమాదం, కోడెల ఆకస్మిక మృతి, రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు అనే వార్తలు వస్తున్నాయి. దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ఈవెంట్ వాయిదా పడినా కనీసం ఆ రోజే సినిమా ట్రైలర్ విడుదల చెయ్యాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. అన్ని భాషలలోనూ భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి ఆశపడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.





