మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. కాసేపటి క్రితం తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమా చుసిన సెన్సార్ బోర్డు వారు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
సినిమా విడుదలకు ఇంకా 10 రోజుల వ్యవధి ఉండటంతో ముందుగానే అన్ని ఏరియాలకు ప్రింట్స్ పంపడానికి తేలిక అవుతుంది. చివరి నిముషంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ముందు సెన్సార్ కు వెళ్లారు. మరోవైపు, సినిమా రన్ టైం 164 నిముషాలు తేలిందని సమాచారం. సాధారణంగా ఇది కొంత మేర ఎక్కువ అనే చెప్పుకోవాలి.
అంత నిడివి ఆడియన్స్ ను తమ సీట్లకు కట్టి పాడెయ్యాలి అంటే సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. అది అంత తేలికైన విషయం ఏమీ కాదు. అయితే టోటల్ గా అసాధ్యం అయితే కాదు. తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తికావడం తో మిగతా వెర్షన్ల సెన్సార్ కూడా తొందరలో పూర్తి చెయ్యబోతున్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సినిమాగా తీయాలని చిరంజీవి చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నారు. అది ఇప్పటికి కుదిరింది. చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి హిస్టారికల్ సినిమా ఇదే. పైగా ఈ సినిమాకు రామ్ చరణే నిర్మాత. దాదాపుగా 200 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. దీనితో సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి.





