బాలీవుడ్ మీడియాకు సైరా స్పెషల్ షో… రాంగ్ స్టెపా!

sye-raa-narasimha-reddy-special show for bollywood media మరి కొన్ని గంటలలో మెగాస్టార్ చిరంజీవి మొదటి హిస్టారికల్ సినిమా, సైరా అమెరికా ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ నిముషాలు లెక్కెట్టడం మొదలు పెట్టారు. ఈలోగా సైరా మొదటి రివ్యూలు ముంబై నుండి వస్తాయని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా కోసం సాయంత్రం 7.15 కి స్పెషల్ షో వేస్తున్నారట.

అంటే మన టైం 10.30 రాత్రి రివ్యూస్ వచ్చేస్తాయి. సహజంగా హిందీ మీడియా మనకు అనుకూలంగా ఉండదు. ఇప్పుడు నెగటివ్ రివ్యూస్ గనుక వస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేసినప్పుడు కూడా ఇదే ఇబ్బంది వచ్చింది. జంజీర్ (తెలుగులో తూఫాన్) కు అప్పట్లో బాలీవుడ్ మీడియా చాలా చెత్త రివ్యూస్ ఇచ్చింది.

ADVERTISEMENT

కాబట్టి ఇది రాంగ్ సెట్ అనే చెప్పుకోవాలి. సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. ఇందులో అగ్రభాగం తెలుగు నుండే రావాలి. మిగతా భాషలలో ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉండడం వల్ల సినిమా కు రావాల్సినంత మైలేజ్ రాలేదని మెగా ఫ్యాన్సే అంటున్నారు.

అయితే ఆయా భాషల కోసం అక్కడి సూపర్ స్టార్స్ తో సినిమాలో నాటింపజేయడం వల్ల అక్కడ ఓపెనింగ్స్ బానే ఉంటాయని సైరా బృందం లెక్క కావొచ్చు. చూడాలి ఏం జరగబోతుంది అనేది. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు

ADVERTISEMENT
Latest Stories