చిరంజీవి ఆశలు వదిలేసుకున్నట్టేనా?

Sye-Raa-Narasimha-Reddy--Valmiki collections dissappoints in other languagesమెగాస్టార్ చిరంజీవి సైరా ఆయన కలల ప్రాజెక్టు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను చిరంజీవి మొత్తానికి తెరకెక్కించారు. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో తెలుగులో భారీ ఓపెనింగ్ వచ్చింది. రెండో మూడో రోజుల్లో కూడా స్థిరంగానే ఉన్నాయి సినిమా వసూళ్ళు.

ADVERTISEMENT

అయితే మిగతా భాషల్లో మాత్రం సినిమా పూర్తిగా నిరాశపరచింది. హిందీలో అయితే 1000 థియేటర్లలో విడుదలై కనీసం విడుదల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. తమిళ, మలయాళీ సినిమాలు కూడా దాదాపుగా అదే పరిస్థితి. అయితే సినిమాకు అన్ని చోట్లా రివ్యూలు పాజిటివ్ గానే ఉండడం విశేషం. కానీ సినిమాను పూర్తిగా టీం వదిలేసినట్టుగా కనిపిస్తుంది.

రివ్యూలు పాజిటివ్ గా ఉండడంతో ప్రమోషన్స్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో… కానీ వారు అదేమీ పట్టించుకోలేదు. బాహుబలి 2 మాదిరి తన సినిమా కూడా దేశవ్యాప్తంగా సక్సెస్ అవ్వాలని చిరంజీవి కోరుకున్నారు. అయితే అది తీరనట్టే. మొత్తం ఆశలన్నీ తెలుగు వెర్షన్ మీదే పెట్టుకున్నారు.

సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. మిగతా భాషలలో పెద్దగా ఏమీ అవకాశం లేకపోవడంతో ఇప్పుడు బాధ్యత అంతా తెలుగు వెర్షన్ మీదే పడింది. ఈ వారాంతంలో వచ్చే కలెక్షన్స్ కీలకం కాబోతున్నాయి. రివ్యూలు పాజిటివ్ గా ఉన్నప్పటికీ సైరా అమెరికా కలెక్షన్స్ ఆ స్థాయిలో కనపడటం లేదు. దీనితో ఈ రెండు రోజులు ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories