మెగాస్టార్ చిరంజీవి మొదటి హిస్టారికల్ సినిమా సైరా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో అమెరికా నుండి అమలాపురం వరకు హడావిడి భారీగా ఉంది. 60వ పడిలో తన డ్రీం ప్రాజెక్టును తెరకెక్కించడానికి మెగా స్టార్ చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది.
సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్, డైలాగ్స్ అదరగొట్టారు. కాకపోతే చిరంజీవి పాత్రలో అయన వయసు స్పష్టంగా కనిపించింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఆంగ్లేయుల మీద పోరాడేటప్పటికి ఆయన వయసు 30 ఏళ్ళు. అయితే దానికి తగినట్టు చిరంజీవి మారలేకపోయారు. ఆ వయసులో అంతకంటే తగ్గడం కష్టం కూడా.
సినిమా చూసిన చాలా మంది ఈ సినిమాలో చిరంజీవి కంటే రామ్ చరణ్ అయితే చాలా బావుండేది అని అభిప్రాయపడుతున్నారు. అయితే తండ్రి డ్రీం ప్రాజెక్టు ఆయనకు అపురూపమైన కనుకగా ఇవ్వాలనుకున్నాడు రామ్ చరణ్. ఇచ్చాడు కూడా. సినిమా నాన్ – బాహుబలి హిట్ అయితే అది నిజంగానే మర్చిపోలేనిదిగా మిగిలిపోతుంది.
సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దానికి రెండింతలు రాబట్టాల్సి ఉంది.





