చిన్న టీంలతో పెద్ద ముప్పే..!

Afghanistan players celebrate during thrilling Super Over against South Africa in T20 World Cup 2026

భారత్ లో జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ ఎప్పుడు ఎలా ఎవరు గెలుస్తారనే విషయం అభిమానులకే కాదు కదా జట్టు సభ్యులకు కూడా తెలియడం లేదు.

ఇంకా వారం రోజులు కూడా నిండకుండానే ఈ టి-20 వరల్డ్ కప్ ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా చిన్న జట్లు తమ నుండి ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చూపుతూ ప్రతి మ్యాచ్లో పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి.

ADVERTISEMENT

ఈ తంతు టి-20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్ నుండే మొదలయ్యింది. పాక్-నెథర్లాండ్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్లో పాక్ కు ఓటమి భయాన్ని రుచి చూపించింది నెథర్లాండ్స్ జట్టు. కానీ, క్లిష్ట సమయంలో ఒత్తిడిని సరిగా హ్యాండిల్ చేయలేక మ్యాచ్ ను చేజార్చుకుని నెథర్లాండ్స్ జట్టు ఓటమి పాలయింది.

అయితే, అదే రోజు అమెరికా జట్టు ఎవ్వరు ఊహించని విధంగా భారత్ ను ముప్ప తిప్పలు పెట్టింది. భారత బ్యాటింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేస్తూ అమెరికా జట్టు సైతం తమ రాకను ప్రకటించుకున్నారు. కానీ, బౌలింగ్ లో రాణించిన భారత్ పరాభవానికి కాస్త దూరంలో మ్యాచ్ ను నెగ్గి గట్టెక్కేసారు.

న్యూజిలాండ్ ఆడిన రెండు మ్యాచ్లను నెగ్గి ప్రస్తుతం టేబుల్ టాపర్స్ గా ఉన్నప్పటికీ, రెండు మ్యాచ్లలోను తమ ప్రత్యర్థులైన ఆఫ్ఘానిస్తాన్ మరియు అరబ్ జట్లు తమ నుండి ఆశించిన దానికన్నా మెరుగైన ప్రదర్శన చూపి న్యూజిలాండ్ జట్టును అవాక్కయ్యేలా చేసారని చెప్పక తప్పదు.

ఇక, మరోపక్క వరల్డ్ కప్ లో నే వన్ అఫ్ ది హాట్ ఫెవరెట్స్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు తీరు చూస్కుంటే నేపాల్ పైన అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో కేవలం 4 పరుగుల తేడాతో గెలిచి, ఓటమి అంచుల వరుకు వెళ్లి మ్యాచ్ ను గెలుచుకున్నారు.

నేపాల్ చూపిన పోరాట పటిమకు అభిమానులు ఆశ్చర్యపోయారు. నిన్న విండీస్ పై జరిగిన మ్యాచ్లో ఓటమి చెంది ఇంగ్లాండ్ మొదటి అపజయాన్ని చూసారు. ఇక, ఈ వరల్డ్ కప్ ఇప్పటి వరుకు జరిగిన మ్యాచ్లలో హైలైట్ అంటే, సౌత్-ఆఫ్రికా VS ఆఫ్ఘానిస్తాన్,

ఆఫ్ఘన్ జట్టు ఈ మ్యాచ్లో చూపిన పోరాట పటిమ కు అభిమానులే కాదు, ఏకంగా క్రికెట్ ఎనలిస్టులు సైతం అవాక్కవ్వక తప్పలేదు. సౌత్ ఆఫ్రికా వంటి గట్టి అపోజిషన్ ను వణికించటమే కాదు, సుమారు మ్యాచ్ ను గెలిచేంత పని చేసింది ఆఫ్ఘన్ జట్టు.

మ్యాచ్ ఒకసారి టై అయ్యిందంటేనే ఉత్కంఠ మాములుగా ఉండదు, అలాంటిది ఈ మ్యాచ్ 2 సార్లు టై అవ్వటమే కాక, రెండవ సూపర్ ఓవర్ ను గెలిచేందుకు 6 బంతుల్లో 24 పరుగులు చెయ్యాల్సిన క్రమంలో ఒక డాట్ మరియు వికెట్ పడిన పిమ్మట గుర్బాజ్ వచ్చి 3 బంతులకు 3 సిక్సులు కొట్టి ఆఫ్ఘన్ జట్టుకు విజయాన్ని ఇచ్చేంత పని చేసాడు.

కానీ, సౌత్ ఆఫ్రికా తమ అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ను ఆఫ్ఘన్ నుండి లాగేసుకున్నారు. ఇలా, ఈ వరల్డ్ కప్ మొదలయి ఇంకా వారం రోజులు కూడా అవ్వలేదు, కానీ పెద్ద టీంలకు అప్పుడే ఇన్ని ముప్పులు ఎదురయ్యాయి.

ఇక పోను పోను ఇంకెన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో. ఫిబ్రవరి 20 వరుకు జరగనున్న ఈ లీగ్ స్టేజ్ ఇంకా ఉత్కంఠభరితంగా మారుతుందనటంలో సందేహమే లేదు. చూడాలి, ఇంకా ఏ చిన్న టీంలు పెద్ద జట్లకు ఝలక్ ఇస్తాయో అని..!

ADVERTISEMENT
Latest Stories