అబ్బో…నువ్వు అబద్దాలు కూడా ఆడతావా?

tamanna bhatia hopes on  next enti movieఒక సినిమా చేసే సమయంలో హీరోయిన్స్ ఆ సినిమాలోని వాళ్ళ పాత్ర గురించి గొప్పగా చెప్పడం సహజమే. అయితే అసలు సినిమాలో వారి పాత్ర ఏమాత్రం పెద్దగా ప్రభావం చూపే పాత్ర కాకపోయినా, కథ, ఆ పాత్ర నచ్చింది కనుక ఒప్పుకున్నాను అంటారు. సరే అవన్నీ సినిమా వాళ్ళ ట్రిక్స్ అని సరిపెట్టుకోవచ్చు అనుకోండి. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అలాంటి అబద్దాలు ఆడుతుంది. అదేమిటీ అంటే ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అయిపోతుంది.

[m9ad]

ADVERTISEMENT

వరుస సినిమాలతో దూసుకుపోయిన తమన్నా తాజాగా ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు ఏమి లేకపోవడంతో చివరకు సందీప్ కిషన్ తో చేసిన సినిమాలపైనే బోలెడు అసలు పెట్టుకుంది ఈ అమ్మడు. అయితే ఎన్ఠీఆర్ బయోపిక్ లో ఒక రోల్ చేస్తున్నప్పటికీ అది ఫుల్ టైం రోల్ కాదు లెండి. ఇక సందీప్ కిషన్ తో చేసిన “నెక్స్ట్ ఏంటి” సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న తమన్నాని ఈ సినిమా గురించి అడగగా…అసలు నేను ఈ సినిమా ఒప్పుకుందే ఈ సినిమాలో పాత్ర చూసి, ఈ పాత్ర నా మాన్సుకు దగ్గరగా అనిపించింది..ముఖ్యంగా హ్యాపీ డేస్..100 % లవ్ తర్వాత అలాంటి పాత్ర నాకు ఈ సినిమాలోనే దొరికింది..అంటూ ఈ పాత్ర న నిజ జీవితాన్ని పోలి ఉండడం వల్లనే ఒప్పుకున్నా అంటూ, అంతే కాదు ఈ సినిమాలో వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉన్న తమన్నాని చూస్తారు మీరు అంటూ తప్పఁకుండా ఈ సినిమా చూడాలి అంటూ చెప్పింది ఈ సుందరి.

ఇదిలా ఉంటే ప్రతీ సినిమా ప్రొమోషన్స్ లో ప్రతీ హీరోయిన్ చెప్పే కధే తమన్నా కూడా చెప్పింది. ఏం చేస్తారు అసలే సినిమాలు లేని పరిస్థితి పాపం…తప్పదు కదా…! మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి అంటే ఈ శుక్రవారం వరకూ ఆగాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories