స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అచ్చి రావు కదా!

Tamannas-next-with-Vishalతెలుగు కుర్రాడు విశాల్ తమిళంలో ఒక స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘పందెంకోడి’ వంటి డబ్బింగ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న విశాల్, స్ట్రెయిట్ తెలుగు సినిమా చేద్దామని ‘సెల్యూట్’ చేసి దారుణ పరాజయం పొందాడు. ఉప్రేంద్ర కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాలను మించిన పరాజయం పొందింది. మళ్ళీ అప్పటి నుండి స్ట్రెయిట్ తెలుగు సినిమాల జోలికి వెళ్ళని విశాల్, తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టనున్నాడు.

జూన్ 9వ తేదీ నుండి సురాజ్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో విశాల్ సరసన ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత తమన్నా ఫేట్ మారిన నేపధ్యంలో ఈ బ్యూటీ అందాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే జగపతిబాబు ప్రధాన విలన్ గా నటించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

ADVERTISEMENT

హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ‘రాయుడు’ సినిమాను తెలుగు ప్రజెంట్ చేసిన హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి నిర్మిస్తున్నారు. తొలి నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే షూటింగ్ జరగనున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్స్ ను చెన్నై, విదేశాలలో చిత్రీకరిస్తామని నిర్మాత స్పష్టం చేసారు. చాలా కాలం తర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విశాల్, మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories